నవ గ్రహాల్లో శుక్రుడు ఒక గ్రహం. చంద్రుడు తర్వాత శుక్రుడు చాలా ప్రకాశవంతమైన గ్రహం. అంతేకాదు శుక్రుడు ప్రేమ, అందం, సామరస్యం, సంబంధాలు, ఆకర్షణ, విలువలు, అభిరుచికి సంబంధించిన గ్రహంగా పరిగణించబడుతుంది. అటువంటి శుక్రుడు ఈ నెలలో 26 వ తేదీన రాశిని మార్చుకోనున్నాడు. ఈ శుక్ర సంచారం వలన మొత్తం రాశులపై పడనుండగా.. కొన్ని రాశులకు అపార నష్టం కలుగనుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
శుక్రుడిని ఆనందం, విలాసాల గ్రహంగా పరిగణిస్తారు. ఇతర గ్రహాల మాదిరిగానే శుక్రుడు దాని నిర్ణీత సమయంలో సంచరిస్తాడు. 2025 సంవత్సరంలో జూలై నెలలో శుక్రుడు జూలై 26న ఉదయం 8.45 గంటలకు సంచరిస్తాడు. శుక్రుడు వృషభరాశి నుంచి బయలుదేరి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే మిథున రాశిలో దేవ గురువు బృహస్పతి ఉన్నాడు. ఈ కారణంగా శుక్రుడు, బృహస్పతి మిథున రాశిలో కలువనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాక్షస గురు శుక్రుడు.. దేవ గురు బృహస్పతిల మధ్య సంబంధం బాగా లేదు. ఈ కారణంగా ఈ రెండు గ్రహాలు కలిసి ఉండటం వల్ల అనేక రాశులవారు సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ రోజు సమస్యలు ఎదుర్కొనాల్సిన రాశులు ఏమిటో తెలుసుకుందాం..
మిథున రాశి: శుక్ర, గురు ఈ రెండు గ్రహాల కలయిక వలన ఈ రాశిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో కొన్ని విషయాలలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. డబ్బు అవసరానికి మించి ఖర్చు కావచ్చు.
కన్య రాశి: ఈ రాశికి చెందిన వారికి శుక్ర సంచారము వలన మంచి ఫలితాలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ సమయంలో కన్య రాశి వారు పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం ఉండదు. కనుక వీరు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సాయంతో ముందుకు సాగండి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు శుక్ర సంచార సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ప్రయాణించవద్దు. ప్రయాణ సమయంలో గాయం లేదా నష్టం జరగవచ్చు. ఎలాంటి వివాదాలకైనా దూరంగా ఉండండి, తగాదాలకు దిగకండి. ముఖ్యంగా జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
మకర రాశి: శుక్ర సంచారము వలన మకర రాశి వారికి సమస్యలు రావచ్చు. ఈ సమయంలో వృత్తిలో ఇబ్బందులు పెరుగుతాయి. వ్యాపారంలో నష్టాలను చవిచూడవలసి రావచ్చు. స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు. అలాగే ప్రేమ జీవితంలో కూడా సమస్యలు ఉండవచ్చు.
