జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీ పర్వదినం రోజున కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి. దీంతో రాఖీ పండగ ప్రాముఖ్యత మరింత పెరిగిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున సర్బార్థ సిద్ధి యోగం, ధనిష్ట నక్షత్రం, రవి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగ ప్రభావం అన్ని రాశులపై పడనున్నా.. అదే సమయంలో జాతకంలో శుభస్థానంలో ఈ యోగాలు ఉంటే కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకుని వస్తాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
హిందువులు జరుపుకునే పండగలలో రాఖీ పండగ సోదరసోదరీమణులు సంతోషంగా జరుపుకునే పండగ. శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున రాఖీ పండగను అక్క చెల్లెళ్ళు.. అన్న దమ్ములు కలిసి జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరులు దీర్ఘాయుష్షుని కోరుతూ రాఖీని రక్షగా కడతారు. అయితే ఒకప్పుడు ఉత్తరాదిలో ఎక్కువగా జరుపుకునే ఈ పండగను ఇప్పుడు కుల మతాలకు అతీతంగా దేశమంతటా జరుపుకుంటున్నారు. అయితే ఈ ఏడాది రాఖీ పౌర్ణమికి ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీ పర్వదినం రోజున కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి. దీంతో రాఖీ పండగ ప్రాముఖ్యత మరింత పెరిగిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున సర్బార్థ సిద్ధి యోగం, ధనిష్ట నక్షత్రం, రవి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగ ప్రభావం అన్ని రాశులపై పడనున్నా.. అదే సమయంలో జాతకంలో శుభస్థానంలో ఈ యోగాలు ఉంటే కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకుని వస్తాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
కన్యా రాశి: రాఖీ పండగ రోజున ఏర్పడనున్న యోగాలు వలన ఈ రాశికి చెందిన వ్యక్తులకు అపార ధన యోగం కలుగ నుంది. ఆర్ధికంగా పురోభివృద్ధి కలుగుతుంది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ఈ సమయం కలిసి వస్తుంది. అఫీసులో మంచి పేరు సంపాదించుకుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు ఈ రాశికి చెందిన వ్యక్తులకు పెరుగుతాయి. మానసికంగా ప్రసాంతంగా ఉంటారు. డబ్బుల ఇబ్బందులు తీరతాయి. రాఖీ పండగ రోజున సోదర సోదరమణులతో సంతోషంగా గడుపుతారు.
ధనస్సు రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు రాఖీ రోజున ఏర్పడనున్న కొత్త యోగాల కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం చేసే వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు కోరుకున్న కోరికలు నెరవేర్చుకునే దిశగా పనులు చేపడతారు. సంపాదన నాలుగు విధాలుగా పెరుగుతుంది. అదే సమయంలో కొన్ని వస్తువులపై అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి
మీన రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు రాఖీ పండగ నుంచి శుభ సముం మొదలవుతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగస్తులు తమ పని తీరుతో అధికారుల మన్ననలను పొందుతారు. కష్టపడి పని చేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం