నవ గ్రహాల్లో రాహు, కేతులను పాప గ్రహాలుగా భావిస్తారు. ఈ గ్రహాలు కొందరికి చెడుని, కొందరికి శుభాలను కలుగజేస్తాయి. 2025 సంవత్సరంలో రాహు-కేతువులు తమ రాశులను మార్చబోతున్నాయి. ఇలా రాశుల మార్పులతో కొన్ని రాశులకు చాలా అదృష్టాన్ని తీసుకుని రానున్నాయి. ఈ సారి రాహు-కేతువుల మార్పు వలన ఏ రాశి వారు లాభపడబోతున్నారో తెలుసుకుందాం.
జ్యోతిషశాస్త్రంలో రాహు-కేతులను అత్యంత క్రూరమైన, పాప గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ గ్రహాలు ఎవరి జాతకంలో ప్రవేశించినా ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కొన్నిసార్లు ఈ గ్రహాలు కొందరికి అదృష్టాన్ని తీసుకుని వస్తాయి. జీవితం ప్రకాశవంతంగా చేస్తాయి. రాహు-కేతువులు తిరోగమన దిశలో ప్రయాణం చేసే గ్రహాలు. రాహువు, కేతువు 18 నెలల తర్వాత రాశిని మార్చుకోనున్నారు. రాహు కేతువులు 2025లో రాశులను మార్చుకోనున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకొస్తే, మరికొందరికి కష్టాలు తీసుకొస్తాయి. ఈ నేపధ్యంలో 2025 లో కొన్ని రాశులకు చెందిన వారు వృత్తి, వ్యాపారంతో పాటు వ్యక్తిగత జీవితంలో శ్రేయస్సును పొందనున్నారు.
రాహు-కేతువుల గమనం ఎప్పుడు మారుతుంది?
వేద పంచాంగం ప్రకారం రాహు-కేతువులు 2025 సంవత్సరంలో 18 నెలల తర్వాత రాశులను మార్చబోతున్నాయి. ఇందులో రాహువు మే 18న మీనరాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు అదే సమయంలో కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు, కేతువుల రాశి మార్పు ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తుంది. కొన్ని రాశులకు ఈ గ్రహ సంచారం శుభప్రదం అవుతుంది.
ఆ అదృష్ట రాశులు ఏవి?
మేష రాశి : రాహు-కేతువుల రాశి మార్పు మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి, ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మీరు ఇంట్లో వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తుంది. సంతోషంగా ఉంటారు.
మిధున రాశి: రాహు-కేతువులు గ్రహాల మార్పు మిథునరాశి వారికి చాలా శుభవార్తలను అందిస్తుంది. మిథున రాశికి చెందిన వ్యక్తులకు అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో వీరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతుంది. పురోగతికి కొత్త దారులు తెరుచుకుంటాయి. వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అంతేకాదు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు సమాజంలో వీరికి గౌరవం కూడా పెరుగుతుంది.
వృశ్చిక రాశి: రాహు-కేతువుల రాశి మార్చుకోనునడంతో వృశ్చిక రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో పరస్పర ప్రేమ పెరుగుతుంది. వీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం శుభ సమయం. ఆర్థికంగా లాభపడతారు. ఆస్తి, కొత్త వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అంతే కాకుండా అవివాహితులకు వివాహ అవకాశాలు ఉంటాయి.
మకర రాశి: మకర రాశి వారికి రాహు-కేతువుల గ్రహాల మార్పు శుభప్రదం కాగలదు. సుఖాలు, సౌకర్యాలు పెరుగుతాయి. కష్టపడితే కష్టానికి తగిన విధంగా మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఆహ్లాదకరమైన ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
Also read
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
- వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య 10 మంది అరెస్టు
- ప్రియుడి కోసం ఇల్లు వదిలి.. పోలీసుల చేతిలో..!
- రథ సప్తమి విశిష్టత
- భార్యపై అనుమానం.. బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్‌తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..