SGSTV NEWS
Astro Tips

నవ గ్రహాల్లో ఏ గ్రహం ఏ రాశిలో ఎన్ని రోజులు ఉంటుంది? ఏ గ్రహం వేగంగా చంచరిస్తుంది? ఏది మందగమనం గలదో తెలుసా..


జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు, రాశులక ప్రత్యేక స్థానం ఉంది. గ్రహాలు సంచరిస్తూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే ఒక గ్రహం ఒక నిర్దిష్ట రాశిలోకి ప్రవేశించినప్పుడు లేదా దానితో సంబంధాన్ని ఏర్పరుచుకున్నప్పుడు.. ఆ గ్రహం ఆ రాశి, దానితో సంబంధం ఉన్న వ్యక్తులను దాని స్వభావాన్ని బట్టి ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం శుభప్రదంగా లేదా అశుభకరంగా ఉంటుంది. ఇది జాతకంలో గ్రహం ఏ ఇంట్లో ఉంది? దాని స్థానం ఏమిటి? అది ఎన్ని రోజులు ఉంటుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు నవ గ్రహాల్లో ఏ గ్రహం ఏ రాశిలో ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా..


జ్యోతిషశాస్త్రంలో ఒక రాశి నుంచి మరొక రాశికి గ్రహాల సంచారం (అంటే కదలిక) నిరంతరం జరుగుతుంది. ప్రతి గ్రహానికి దాని సొంత వేగం ఉంటుంది. దీని కారణంగా అవి వేర్వేరు కాలాల పాటు ఒకే రాశిలో ఉంటాయి. ఈ గ్రహ సంచారం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. గ్రహాల సంచారం కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని రాశులకు ఇబ్బందులకు కారణమవుతుంది. ఏ గ్రహం ఏ రాశిలో ఎన్ని రోజులు ఉంటుందో తెలుసుకుందాం?

రాశులో ఉండే గ్రహాల సమయం

1  సూర్యుడు ఒక రాశిలో సంచరిస్తున్నప్పుడు.. ఆ రాశిలో దాదాపు 1 నెల (30 రోజులు) ఉంటుంది.
  సూర్యుడు ఆత్మ, తండ్రి, గౌరవం, ప్రభుత్వ రంగం, ఆత్మవిశ్వాసానికి కారకుడు. సూర్యుడి సంచారము ప్రతి నెలా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతుంది.

2    చంద్రుడు ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు.. దాదాపు రెండున్నర రోజులు (సుమారు 54 గంటలు) అదే రాశిలో ఉంటాడు. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, తల్లి , శీఘ్ర ఆలోచనలకు కారకుడు. చంద్రుడు నవ గ్రహాల్లో అత్యంత వేగంగా కదిలే గ్రహం. కనుక తక్కువ సమయంలోనే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాడు.

3   కుజుడు ఒక రాశిలో దాదాపు 45 నుంచి 57 రోజులు ఉంటాడు. కుజుడు శక్తి, ధైర్యం, భూమి, సోదరుడు, కోపానికి కారకుడు.

4   బుధుడు ప్రతి రాశిలో దాదాపు 25 నుంచి 30 రోజుల పాటు సంచరిస్తాడు. బుధుడు తెలివితేటలు, వాక్కు, కమ్యూనికేషన్, వ్యాపారం, తర్కానికి కారకుడు. బుధుడి కదలిక సూర్యుని చుట్టూ ఉంటుంది.


5  శుక్రుడు ఒక రాశిలో దాదాపు 23 నుంచి 30 రోజులు ఉంటాడు. ప్రేమ, అందం, భౌతిక సుఖాలు, కళ , వైవాహిక జీవితానికి శుక్రుడు కారకుడు.

6  బృహస్పతి (గురువు) ఒక రాశిలో దాదాపు 1 సంవత్సరం (12 నెలలు) ఉంటాడు. బృహస్పతి జ్ఞానం, మతం, అదృష్టం, సంపద, గురువులకు కారకుడు. ఈ గ్రహం గమనం నెమ్మదిగా జరుగుతుంది. తక్కువ వేగం కారణంగా బృహస్పతి ఒక రాశిలో ఎక్కువ కాలం అంటే ఒక ఏడాది ఉంటాడు.

7   శనీశ్వరుడు నవ గ్రహంల్లో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. అందుకనే శనిశ్వరుడిని మందగమనుడు అని అంటారు. శనీశ్వరుడు ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు (2.5 సంవత్సరాలు) ఉంటాడు. శనీశ్వరుడు కర్మ, క్రమశిక్షణ, న్యాయం, వయస్సు, దుఃఖం, సేవకు కారకుడు. ఇది నెమ్మదిగా కదిలే గ్రహాలలో ఒకటి.

8   రాహువు, కేతువు : ప్రతి రాశిలో దాదాపు 18 నెలలు (ఒకటిన్నర సంవత్సరాలు) సంచరిస్తారు. రాహువు ,కేతువులు ఛాయా గ్రహాలు. ఎల్లప్పుడూ తిరోగమనం (రివర్స్) లో కదులుతారు. రాహువు భ్రమ, విదేశీ సంబంధాలు , ఆకస్మిక సంఘటనలకు సూచిక అయితే.. కేతువు ఆధ్యాత్మికత, ఒంటరితనం ,అంతర్ దృష్టికి సూచి. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువు , కేతువు 18 సంవత్సరాల కక్ష్య చక్రం కలిగి ఉంటారు, ఎల్లప్పుడూ ఒకదానికొకటి 180 డిగ్రీలు కక్ష్యలో ఉంటారు

ఈ కాలాలు సగటున ఉంటాయి. గ్రహాలు తిరోగమనం లేదా ప్రత్యక్షంగా ఉండటం వల్ల వాటి వేగంలో స్వల్ప మార్పు ఉండవచ్చు. గ్రహాల సంచారం జ్యోతిషశాస్త్రంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అవి.. అవి వెళ్ళే రాశికి సంబందించిన శక్తిని ప్రభావితం చేస్తాయి. సంబంధిత రాశికి చెందిన వ్యక్తులపై శుభ లేదా అశుభ ప్రభావాలను చూపుతాయి.



 

Related posts

Share this