SGSTV NEWS
AstrologySpiritual

Navaratri 2025: నవరాత్రిలో అరుదైన యోగాలు.. దుర్గమ్మ అనుగ్రహం ఈ మూడు రాశుల సొంతం..



శరన్నవరాత్రి వేడుకలు సెప్టెంబర్ 22, 2025న ప్రారంభం కానున్నాయి. నవరాత్రి సమయంలో బ్రహ్మయోగం, శుక్లయోగం , మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతున్నందున.. మొత్తం 12 రాశులకు చెందిన వ్యక్తులపై ప్రభావం చూపిస్తుంది. అయితే కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు నవరాత్రి సమయం చాలా శుభప్రదంగా, ఫలవంతంగా ఉంటుందని నమ్ముతారు. జ్యోతిష్య, మతపరమైన దృక్కోణంలో కూడా ఈ సమయాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు.


ఈ ఏడాది దేవీ నవరాత్రి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి స్వరూపమైన నవ దుర్గలను పూజిస్తారు. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం నవరాత్రి బ్రహ్మయోగం, శుక్లయోగం, మహాలక్ష్మీ రాజయోగంతో సహా అనేక శుభ యోగాలతో ప్రారంభమవుతుంది. ఈ సమయం ఆధ్యాత్మిక కోణం నుంచి మాత్రమే కాదు కెరీర్, సంపద, వ్యక్తిగత జీవితానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేక యోగాలు అనేక రాశులకు చెందిన వ్యక్తులపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతాయి. దుర్గమ్మ అనుగ్రహం పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

సింహ రాశి: నవరాత్రి సమయం సింహరాశి వారికి అదృష్టం , విజయాన్ని తెస్తుంది. శుభ నవరాత్రి కాలంలో సింహరాశి వారికి ఆస్తి ,వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనేక ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. బలపడతాయి. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఇది ఆర్థిక పురోగతికి సమయం. కొత్త సంపద వనరులు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. ఈ సమయం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.


మేషరాశి: ఈ సంవత్సరం నవరాత్రి మేష రాశి వారికి శుభప్రదమైన సమయాలను తెస్తుంది. ఈ సమయం మేష రాశి వారికి ఆత్మవిశ్వాసం, శక్తిని పెంచుతుందని నమ్మకం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంకా, కెరీర్, వ్యాపారంలో కొత్త అవకాశాలు తలెత్తవచ్చు. దుర్గాదేవి ఆశీస్సులతో, కుటుంబంలో శాంతి, ఆనందం వెల్లివిరుస్తాయి.

శారదీయ నవరాత్రుల ప్రాముఖ్యత
శారదీయ నవరాత్రి పండుగ శక్తి ఆరాధన, కుటుంబ శ్రేయస్సును సూచిస్తుంది. ఈ సంవత్సరం శారదీయ నవరాత్రి సెప్టెంబర్ 22, 2025న ప్రారంభమవుతుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సమయంలో భక్తులు దుర్గాదేవి విగ్రహం లేదా చిత్రాన్ని వారి ఇళ్లలో, మండపాల్లో, దేవాలయాలలో ప్రతిష్టించి పూజిస్తారు. నవరాత్రి సమయంలో కలశ సంస్థాపన, భజన-కీర్తన,హవనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కార్యకలాపాల ద్వారా దేవి ప్రసన్నం అవుతుందని.. ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. ఇంటికి శ్రేయస్సు, సానుకూల శక్తిని తెస్తాయి.

Also read

Related posts