జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు, గ్రహణాలు చాలా చాలా ముఖ్యమైనవి. ఈ రెండు సంఘటనల ప్రభావం ప్రతి రాశి వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటనలు ఒకే రోజు లేదా పండుగల సమయంలో జరిగితే అది మరింత ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.
ఈ సంవత్సరం మార్చి 14న హోలీ జరగనుంది. 2025లో మొదటి చంద్ర గ్రహణం కూడా అదే రోజున ఏర్పడుతుంది. దీంతో పాటు అదే రోజున సూర్యుడు మీన రాశిలో ప్రవేశిస్తాడు. ఇలాంటి అరుదైన సంఘటన 100 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. దీనితో కొన్ని రాశుల వారికి చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. ఆ రాశులు ఏంటి..? వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి
హోలీ రోజున సూర్యుడు కదలడం, చంద్ర గ్రహణం వల్ల మిథున రాశి వారికి గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు చాలా లాభాలు పొందుతారు. ఉద్యోగం చేసే వారికి జీతం పెరుగుతుంది. పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది.
వృషభ రాశి
హోలీ రోజున సూర్యుడు కదలడం, చంద్ర గ్రహణం కారణంగా వృషభ రాశి వారికి ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందే కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కలిసి వ్యాపారం చేసే వారు మంచి లాభాలు పొందుతారు. పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుండి మంచి లాభాలు వస్తాయి. చాలా కాలంగా ఉన్న కోరికలు నెరవేరుతాయి. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెడితే ఊహించని లాభాలు పొందవచ్చు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు హోలీ రోజున సూర్యుడు కదలడం, చంద్ర గ్రహణం కారణంగా అదృష్టంకి సంబంధించి పూర్తి మద్దతు పొందుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరులను ఆకర్షించడానికి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. పెళ్లయిన వారు సంతోషకరమైన జీవితం గడుపుతారు. పనికి సంబంధించిన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఈ ప్రయాణం మంచి ఆర్థిక లాభాలను తెస్తుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!