మాస శివరాత్రికి హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శివ పార్వతులను పూజించి ఉపవాసం ఉంటారు. ఎవరైతే ఈ రోజున పూజ చేసి ఉపవాసం ఉంటారో వారి పట్ల భోలాశంకరుడు అనుగ్రహం కలిగి ఉంటాడని.. కోరుకున్న ఫలితాలను ఇస్తాడని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారి జాతకం ఈ మాస శివరాత్రి నుంచి మారబోతున్నాయి. ఆ ఏయే రాశులవో తెలుసుకుందాం
హిందూ మతంలో మాస శివరాత్రి రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది. నెల నెలా వచ్చే మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండి ఆది దంపతులను పూజిస్తారు. ఇలా చేయడం వలన తన భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తారని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి ఏడాది మార్గశిర మాసంలోని వచ్చే మాస శివరాత్రి నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. మూడు రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసంలో నెలవారీ శివరాత్రి తిధి డిసెంబర్ 29 తెల్లవారుజామున 3.32 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు డిసెంబర్ 30 ఈ తిధి ఉదయం 4:01 గంటలకు ముగుస్తుంది. దీంతో డిసెంబర్ 29న మాస శివరాత్రి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈసారి మాస శివరాత్రి రోజున అరుదైన యోగాలు చోటు చేసుకోనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాస శివరాత్రి రోజున మూడు రాశుల వారి అదృష్టం మారవచ్చు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహ రాశి: ఈ రాశి వారికి ఈ మాస శివరాత్రి నుంచి ప్రయోజనాలు లభించనున్నాయి. సింహ రాశి వారికి వ్యాపారంలో లాభిస్తుంది. వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అంతేకాదు ఈ రాశివారు కోల్పోయిన ప్రేమను తిరిగి పొందే అవకాశం ఉంది.
మకరరాశి: ఈ రాశికి చెందిన వారికి నెలవారీ శివరాత్రి నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగనున్నాయి. వీరికి సంపద, శ్రేయస్సు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. అటువంటి పరిస్థితిలో ఈ రోజున, మకర రాశి వారు గంగాజలంలో నల్ల నువ్వులను కలిపి శివయ్యకు జలాభిషేకం చేయాలి.
మిధున రాశి: మాస శివరాత్రి రోజు మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజున మిథున రాశి వారికి శివుని విశేష ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజు మిథునరాశి వారికి ఇల్లు లేదా వాహనంలో పెట్టుబడి పరంగా మంచిది.