జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలకు, రాశులకు ప్రతేక స్థానం ఉంది. నవ గ్రహాల్లో ఒకటైన బృహస్పతి దేవ గురువు. బృహస్పతి జ్ఞానం, విద్య , ఆధ్యాత్మికతకు అధిపతిగా పరిగణించబడుతున్నాడు. ఈ విషయాలను ప్రభావితం చేస్తాడు. బృహస్పతిని గురు గ్రహం అని కూడా అంటారు. గురువు ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. దీంతో గురువు ఒక రాశి నుంచి వెళ్ళిన తర్వాత అదే రాశిలోకి అడుగు పెట్టడానికి 12 సంవత్సరాలు పడతాయి.
దేవగురువు బృహస్పతి త్వరలో రాశిని మర్చుకోనున్నాడు. ఈ సారి బృహస్పతి మిథునరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. బృహస్పతి ఏ రాశిలో సంచరిస్తాడో ఆ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం మే 14న రాత్రి 11: 20 గం. మిథునరాశిలోకి బృహస్పతి అడుగు పెట్టనున్నాడు. గురు సంచారంతో మొత్తం రాశులపై ప్రభావం పడుతుంది. ఈ రోజు బృహస్పతి సంచారంతో ఏయే రాశులపై ఎలా ప్రభావం ఉంటుంది.. ఏ పరిహారాలు చేయాలి తెలుసుకుందాం..
మేషరాశి: దేవ గురువు మిథునరాశిలోకి అడుగు పెట్టిన తర్వాత మేష రాశికి చెందిన వారు కొత్త వ్యాపార అవకాశాలను పొందుతారు. అన్నదమ్ముల మధ్య సంబంధాలు బలపడతాయి. అయితే వీరు సోమరితనం విడిచి పెట్టాల్సి ఉంటుంది. మానసిక ఒత్తడి, అలసట వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. వీరు గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం శుభాఫలితలను అందిస్తుంది.
వృషభ రాశి: బృహస్పతి మిథునరాశిలో సంచరించే సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. అంతేకాదు శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. ఆఫీసులో లేదా పని చేసే చోట కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఈ రాశికి వారు గురువు అనుగ్రహం కోసం గురువారం బృహస్పతికి సంబంధించిన మంత్రాలను జపించడం మంచిది.
మిథున రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు కృషికి తగిన ఫలితాలను అందుకుంటారు. సక్సెస్ వీరి సొంతం. కొత్త సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. కెరీర్ లో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. విదేశీ ప్రయాణం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరు పెసర పప్పుని దానం ఇవ్వడం శుభప్రదం.
కర్కాటక రాశి: వీరు ఆరోగ్య సంబధిత సమస్యలు ఎదుర్కొనే అవకాశం.. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, ఒత్తిడికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా ప్రయాణం చేస్తారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ఫలిస్తాయి. గురువు అనుగ్రహం కోసం గురువారం బృహస్పతికి సంబంధించిన మంత్రాలు జపించండి.
సింహరాశి: వీరు ఆర్ధిక లాభాలను అందుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగులు ఆఫీసులో తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. మానసికంగా బలంగా ఉండే ప్రయత్నం చేయండి. వీరు గురువారం రోజు గురువు ఆశీర్వాదం తీసుకోవడం వలన సుఖ సంతోషాలు లభిస్తాయి.
కన్య రాశి: వీరు తమ లక్ష్యాలను అందుకుంటారు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. ఆదాయం పెరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశాల్లో పనిచేసే ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. జీతం పెరుగుదల ఉంటుంది. వీరు బృహస్పతి అనుగ్రహం కోసం పుష్పరాగం ధరించడం మంచిది.
తుల రాశి: వీరికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు, గౌరవం పెరుగుతుంది. కెరీర్ లో ముందుకు వెళ్లడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యారంగంలో పురోభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వీరు రోజూ ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు నుదిటిన కుంకుమ ధరించడం మంచిది
వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు ఉమ్మడి పెట్టుబడి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యం, వారసత్వం సంబంధాలలొ నమ్మకం, పారదర్శతను కాపాడుకోవాలి. అనారోగ్యంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు పరిహారం కోసం గురువారం 108 సార్లు ఓం అని జపించాలి.
ధనస్సు రాశి: వీరు పెట్టుబడుల్లో ఆర్థిక లాభాలను అందుకుంటారు. ఆదాయ పరంగా బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఆధ్యాత్మిక యాత్రలను చేసే అవకాశం ఉంది. వీరు పరిహారంగా గురువారం స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకోండి.
మకర రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. ఆఫీసులో తోటి ఉద్యోగాస్తులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆదాయం పెంచుకునే అవకాశాలు లభిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వీరు పరిహారం కోసం గురువారం రోజు ఓం గ్రాన్ గ్రీన్ గ్రౌన్ స: గురవే నమ: మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదం.
కుంభ రాశి: వీరిపై బృహస్పతి సంచారం ప్రభావం చూపుతుంది. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులతో లాభాలను అందుకుంటారు. పిల్లలకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్ మార్పులు ఉంటాయి. వీరు గురువు అనుగ్రహం కోసం పరిహారంగా గురువారం రోజు వినాయకుడిని పూజించి పసుపు రంగు స్వీట్లను నైవేధ్యంగా పెట్టి ప్రసాదంగా పంచిపెట్టండి.
మీన రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు కెరీర్ లో ఎదిగేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్, గృహ సంబంధిత వ్యాపారంలో పెట్టుబడులతో లాభాలను అందుకుంటారు. ఈ రాశికి చెందిన వారు గురువు అనుగ్రహం కోసం గురువారం అరటిచెట్టుకి పసుపు కలిపిన నీళ్లు పోయడం మంచి పరిహారం
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..
- పిల్లలను కారులో ఉంచి లాక్ చేయడంతో…కొంచమైతే ఎంతఘోరం జరిగేది?
- పోలీసోళ్లను పిచ్చోళ్లను చేసింది.. MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ !
- తిరుపతి అక్టోపస్ పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్య..మర్డర్ వెనుక సంచలన విషయాలు
- నేటి జాతకములు..19 ఏప్రిల్, 2025
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!