Telugu Astrology: ప్రస్తుతం వృషభ రాశిలో తనకెంతో ఇష్టమైన రోహిణి నక్షత్రంలో గురు గ్రహం సంచారం చేస్తోంది. దీంతో మరింత బలం పుంజుకోనున్న గురు గ్రహం మరింతగా శుభ యోగాలు కలగజేసే అవకాశం ఉంది. మే 25వ తేదీతో వృషభ రాశి నుంచి నిష్క్రమించి మిథున రాశిలో ప్రవేశించబోతున్న గురువు తాను చేయదలచుకున్న మేలంతా పూర్తి చేయడం జరగబోతోంది. కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు పలు రకాల శుభ యోగాలు
ప్రస్తుతం వృషభ రాశిలో తనకెంతో ఇష్టమైన రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల గురు గ్రహం మరింత బలం పుంజుకోవడంతో పాటు మరింతగా శుభ యోగాలు కలగజేసే అవకాశం ఉంది. మే 25వ తేదీతో వృషభ రాశి నుంచి నిష్క్రమించి మిథున రాశిలో ప్రవేశించబోతున్న గురువు తాను చేయదలచుకున్న మేలంతా పూర్తి చేయడం జరగబోతోంది. ఈ రెండున్నర నెలల కాలంలో గురువు చాలావరకు రోహిణి నక్షత్రంలోనే సంచారం చేసే అవకాశం ఉంది. ఫలితంగా గురువు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారికి అనేక శుభ యోగాలు కలగజేయడం జరగబోతోంది.
మేషం
ఈ రాశికి అత్యంత శుభుడైన గురువు ప్రస్తుతం ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందడమే తప్ప తగ్గే అవకాశం ఉండదు. ఆదాయ ప్రయత్నాలను ఎంత ఎక్కువ చేస్తే అంతగా లాభం పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమై, కుటుంబంలో అన్యోన్యత, సామరస్యం బాగా వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి, గృహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మాటకు విలువ పెరుగుతుంది
కర్కాటకం
రాశ్యధిపతి చంద్రుడికి అత్యంత ఇష్టమైన గురు గ్రహం ఈ రాశివారిని అనేక విధాలుగా ఉచ్ఛ స్థితికి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా వృద్ది చెందుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలుగుతాయి. విదేశాల్లో చదువులు, ఉద్యోగాలకు మార్గం సుగమం అవుతుంది. వారసత్వ సంపద, పిత్రార్జితం లభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
సింహం
రాశ్యధిపతి రవికి ప్రాణ స్నేహితుడైన గురువు ఈ రాశివారికి అత్యధికంగా ఆదాయ లాభం, అధికార లాభం అనుగ్రహించే అవకాశం ఉంది. ప్రస్తుతం గురువు ఈ రాశికి దశమ స్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగపరంగా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, జీతభత్యాలు పెరగడం, నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించడం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
వృశ్చికం
రాశ్యధిపతి కుజుడికి అత్యంత సన్నిహితుడైన గురువు ప్రస్తుతం సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ప్రేమ వ్యవహారాల్లో, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో స్థిరమైన జీవితం లభి స్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు.
ధనుస్సు
ఈ రాశి గురువు సొంత రాశి అయినందువల్ల అనేక సమస్యలు, వివాదాల నుంచి గట్టెక్కించడంతో పాటు ఆదాయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీనం
ఈ రాశికి అధిపతి గురువే అయినందువల్ల మరో రెండున్నర నెలల పాటు ఈ రాశివారికి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ప్రస్తుతం తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న గురువు ఏ రంగంలో ఉన్నవారికైనా వృద్ధిని, అభివృద్ధిని, పురోగతిని అనుగ్రహించే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. సొంత ఇల్లు అమరుతుంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025