April 7, 2025
SGSTV NEWS
Astro TipsAstrology

Lucky Zodiac Signs: చంద్ర మంగళ యోగం.. ఆ రాశుల వారికి అధికారం, ఆదాయం పక్కా..!

 

కర్కాటక రాశిలో ఏర్పడే చంద్ర మంగళ యోగం కొన్ని రాశుల వారికి అత్యంత శుభప్రదం. ఈ యోగం వల్ల ఆ రాశుల వారికి ఆదాయ వృద్ధి, ఉద్యోగ పదోన్నతులు, వృత్తి వికాసం లాంటి శుభ ఫలితాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఆస్తి లాభాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ యోగం 40 రోజుల వరకు ప్రభావం చూపుతుంది.


Telugu Astrology: ఏప్రిల్ 6, 7, 8 తేదీల్లో కర్కాటక రాశిలో, అత్యంత శుభప్రదమైన పునర్వసు నక్షత్రంలో చంద్ర మంగళ యోగం ఏర్పడుతోంది. అధికారానికి, ఆదాయ వృద్ధికి సంబంధించిన ఈ యోగం కుజ, చంద్రులు ఒకరికొకరు 1, 4, 7, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు కర్కాటక రాశిలో కలిసి ఉండేది రెండు మూడు రోజులే అయినప్పటికీ దీని ప్రభావం మాత్రం సుమారు 40 రోజులు ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ రెండు మూడు రోజుల్లో తలపెట్టే ఆదాయ వృద్ది ప్రయత్నాలు సమీప కాలంలో తప్పకుండా నెరవేరుతాయి. పదోన్నతుల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ చంద్ర మంగళ యోగం వల్ల లాభపడేది మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశులు.

👉   మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు నాలుగవ స్థానంలో ఈ రాశికి అత్యంత శుభుడైన చంద్రుడితో యుతి చెందడం వల్ల శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. రాబడి, లాభాలు అంచనాలను మించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సొంత ఇంటి ప్రయత్నాలు నెరవేరుతాయి.

👉   కర్కాటకం: ఈ రాశిలో రాశ్యధిపతి చంద్రుడితో ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడితో కలవడం వల్ల రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆస్తి లాభం, భూ లాభం కలిగి అవకాశాలున్నాయి. సొంతగా ఇల్లు అమరే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవడం జరుగుతుంది.

👉  కన్య: ఈ రాశికి లాభ స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల అనేక విధాలుగా పురోగతి ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా దూసుకుపోతాయి. యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు బాగా వృద్ధి చెందు తాయి. తల్లితండ్రుల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

👉  తుల: ఈ రాశికి దశమ స్థానంలో ఈ రాశికి అత్యంత శుభులైన చంద్ర, కుజుల కలవడం వల్ల అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశాల్లో స్థిరత్వం లభించే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ పూర్తి ఫలితాలనిస్తాయి.

👉   వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో, భాగ్యాధిపతి చంద్రుడితో యుతి చెందడం వల్ల రాజయోగాలు కలుగుతాయి. పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ధన యోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల్లో మంచి ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.


👉  మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో ఈ రాశికి అత్యంత శుభులైన కుజ, చంద్రులు కలవడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం కలుగుతుంది. ఉద్యోగంలో సమర్థతకు ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు హోదా పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో లాభాల బాట పడతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.

Alsp read

Related posts

Share via