జ్యోతిషశాస్త్రంలో గ్రహాలకు, రాశులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మనిషి జన్మ కుండలిలోని రాశులను, నక్షత్రాలను గ్రహాల ఆధారంగా మనిషి జాతకాన్ని తెలుసుకుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులున్నాయి. ఈ ప్రతి రాశి దాని సొంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. అనేక రాశులకు చెందిన వ్యక్తులు తమ స్వభావం కారణంగా చాలా త్వరగా కలత చెందుతారు. వీరికి ముక్కుమీదే కోపం ఉంటుంది. ఈ నేపధ్యంలో దుర్వాస మహర్షి కి ఉన్నంత కోపం ఉంటుందని ఈ రాశులకు. మరి ఆ రాశులు ఏమిటో తెల్సుకుందాం..
సృష్టిలో మనిషిని పోలిన మనిషి అరుదుగా ఉన్నట్లే.. మనిషి మనిషి నడుచుకునే విధానం, ఆలోచించే తీరు , అలవాట్లు, ప్రవర్తన అన్నీ భిన్నంగా ఉంటాయి. కొంతమంది చిన్న చిన్న విషయాలకే భయపడతారు. మరికొందరు చాలా త్వరగా కలత చెందుతారు. ఇంకొందరు అతి త్వరగా కోపం తెచ్చుకుంటారు. జ్యోతిషశాస్త్రంలో మొత్తం 12 రాశులు వాటి సొంత ప్రత్యేక స్వభావాన్ని కలిగి ఉన్నాయి. అందుకే ఒకరి స్వభావానికి మరొకరి స్వభావం భిన్నంగా ఉంటుంది. ఈ రోజు ఐదు రాశులకు చెందిన వారికీ సహనం తక్కువ, చాలా త్వరగా చిరాకుపడి పోతారు అంతేకాదు చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. ముక్కుమీదే కోపం ఉంటుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశి వారికి అధిపతి కుజుడు. కుజుడు అగ్ని గ్రహం. ఈ రాశి వారు శక్తి, ఉత్సాహాన్ని భిన్నంగా కలిగి ఉంటారు. ఈ రాశి వారిది అగ్నితత్త్వంతో ఉంటారు. దీంతో కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు. మేష రాశి వారు అత్యంత వేగాన్ని ఇష్టపడతారు. చేపట్టిన ప్రతి పనిని త్వరగా పూర్తి చేస్తారు. అందుకే ఈ రాశి వారు నెమ్మదిగా లేదా తేలికగా, తీరికగా పనిని పూర్తి చేసే వ్యక్తులను చూసి చిరాకు పడతారు. మేష రాశి వారు తమ ఇష్టానుసారం పనిచేయడానికి ఇష్టపడతారు. పని వారి ఇష్టానుసారం జరగకపోతే, వారు కలత చెందుతారు.
వృషభ రాశి: వృషభ రాశి వారు స్వతహాగా మొండిగా ఉంటారు. వీరు తమ దినచర్యను ఒక పద్ధతిలో సాగిపోవాలని కోరుకుంటారు. ఒక జీవన విధానాన్ని చాలా ఇష్టపడతారు. తమ దినచర్యను ఎవరికీ మార్చరు. ఏదైనా మార్పు వస్తే.. చాలా కోపంగా ఉంటారు. వృషభ రాశి వారు తమ సొంత సౌలభ్యం ప్రకారం పనులు ప్లాన్ చేసుకుంటారు.
మిథున రాశి: మిథున రాశి వారికీ నిజాయితీ అంటే చాల ఇష్టం. వీరు తమ విషయాలను స్నేహితులకు , కుటుంబ సభ్యులకు చెప్పడానికి ఇష్టపడతారు. అయితే తాము చెప్పిన విషయాలను , తనను పట్టించుకోవడం లేదని గ్రహిస్తే.. త్వరగా కోపం వస్తుంది. ఈ వ్యక్తులు తమని విస్మరించడాన్ని అస్సలు ఇష్టపడరు.
కన్య రాశి: కన్య రాశి వారు చిన్న చిన్న విషయాల పట్ల కూడా శ్రద్ధ చూపుతారు. అందుకే ఈ రాశి వారిని పరిపూర్ణతావాదులు అంటారు. వీరు ప్రతి పనిని సరైన పద్ధతిలో చేయడానికి ఇష్టపడతారు. చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను అస్సలు ఇష్టపడరు. అందుకే ఈ రాశి వారు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. అస్తవ్యస్తమైన వస్తువులను చూసినప్పుడు విపరీతంగా కోపంగా ఉంటారు.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశికి అధిపతి అంగారక గ్రహం. కుజుడు ఒక అగ్ని గ్రహం, ఈ రాశి అభిరుచి, శక్తితో నిండి ఉంటుంది. ఈ వ్యక్తులు ప్రతి పని చేయడానికి అపారమైన మక్కువ కలిగి ఉంటారు. ఎవరైనా మోసపూరతమైన ఆలోచనలు కలిగి ఉన్నా లేదా నిజాయితీ లేనివారి పట్ల వీరు విపరీతంగా కోపంగా ఉంటారు.
