మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల్పూర్ అటవీశాఖ చెకోపోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న బీట్ అధికారి సాయికుమార్ పై కొందరు యువకులు ఆదివారం రాత్రి దాడి చేశారు.
జన్నారం, : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల్పూర్ అటవీశాఖ చెకోపోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న బీట్ అధికారి సాయికుమార్ పై కొందరు యువకులు ఆదివారం రాత్రి దాడి చేశారు. జన్నారం ఎస్సై రాజవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. మేదరిపేట వద్ద ఓ కారు బైకును ఢీ కొట్టి వెళ్లిపోయింది. బైక్ పై ఉన్న వ్యక్తి.. చెకోపోస్ట్ వద్ద రాత్రి విధుల్లో ఉన్న బీట్ అధికారి సాయికుమార్ కు ‘ఓ తెల్లని కారు యాక్సిడెంట్ చేసి వస్తోంద’ంటూ ఫోన్లో సమాచారం ఇచ్చాడు. దీంతో లక్షెట్టిపేట నుంచి జన్నారం వైపు వస్తున్న కారును ఆయన ఆపారు. అయితే బైక్ పై వెళుతున్న వ్యక్తి గ్రామస్థులకు కూడా సమాచారం ఇవ్వడంతో మేదరిపేట నుంచి ద్విచక్రవాహనాలపై కొందరు యువకులు చెకోపోస్ట్ వద్దకు చేరుకున్నారు. సమాచారలోపం కారణంగా కారులో ఉన్న వ్యక్తులను వదిలిపెట్టి విధులు నిర్వర్తిస్తున్న బీట్ అధికారిపై దాడి చేశారు. అడ్డుకోబోయిన బేస్ క్యాంపు వాచర్ శ్రీనివాస్ నూ కొట్టారు. తీవ్రంగా గాయపడిన సాయికుమార్ను కరీంనగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. బీట్ అధికారి ఫిర్యాదు మేరకు దండేపల్లి మండలం మేదరిపేటకు చెందిన ఆడె శ్రావణకుమార్, తీగల ఉదయ్ తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Also read
- Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
- ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
- ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
- సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం
- పూజ అయిపోయిన వెంటనే చేయకూడని 5 పనులు ఇవే..అలా చేస్తే దరిద్రం తప్పదు!