December 3, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

నిర్వహణలో కానిస్టేబుల్ మృతి.. అండగా ఉంటామని హోంమంత్రి హామీ




* విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్..

* ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించిన హోం మంత్రి అనిత..



Andhra Pradesh: విధి నిర్వహణలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు ఏపీ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత.. సీఎం చంద్రబాబు నాయుడు బందోబస్తు విధులకోసం వచ్చిన.. ఏఆర్ కానిస్టేబుల్ చంద్రా నాయక్ గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. సహచరులు ఎంతో శ్రమించి సీపీఆర్
చేసి కాపాడాలని ప్రయత్నించినా ఏఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్ (పీసీ 3570) అకాలమరణం చెందడం అత్యంత విషాదకరం అన్నారు.. చంద్రానాయక్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని స్పష్టం చేశారు హోం మంత్రి అనిత……… ఈ ఘటనపై సమాచారం తెలిసిన వెంటనే ఆంధ్రా హాస్పిటల్ కి వెళ్లి కానిస్టేబుల్ చంద్రా నాయక్ పార్థివదేహానికి నివాళులర్పించిన హోంమంత్రి.. అనంతపురం జిల్లాకు చెందిన చంద్రనాయక్ కుటంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డ్రైవర్ సహా పలువరు మృతి చెందడం
శోచనీయమన్నారు. ప్రమాదం జరిగిన తీరును ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు హోం మంత్రి వంగలపూడి అనిత..

Also read

Related posts

Share via