AP News : ఫోటోలో పిల్లాడిని చూశారుగా. ఎంత చక్కగా ఉన్నాడో. అందరిలానే స్కూల్కు వెళ్లాల్సిన వయస్సు. మంచిగా చదువుకోవాల్సిన అబ్బాయి. కానీ, బడి పక్కనే జరుగుతున్న మత్తు దందా ఆ పిల్లాడిని బలిగొంది. మత్తుకు బానిసగా మార్చేసింది.స్నేహితులనూ ఆ ఊబిలోకి దించేలా చేసింది. కట్ చేస్తే.. ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు ఆ చిన్నోడు.
అసలేం జరిగిందంటే..
స్కూల్ ఏరియాలో ఎవరైనా చాక్లెట్లో.. బిస్కెట్లో అమ్ముతారు. కానీ ఆ స్కూల్ ఏరియాలో నిర్భయంగా మత్తుమందు అమ్ముతున్నారు. పాపం ఎవరిదైతేనేం.. ఆ పాపానికి అన్యంపుణ్యం ఎరుగని విద్యార్థి ప్రాణం బలి అయింది. విశాఖ, సింహాచలం సమీపంలోని గోపాలపట్నం ZPHS స్కూల్లో ఎనిమిదో తరగతి చదువే వాడు సాయి లోకేష్. స్కూల్ పక్కనే ఫెవికాల్ కవర్లో మత్తు మందు అమ్ముతున్నారు. మెళ్లిగా దానికి అలవాటు పడ్డాడు. మూడేళ్లుగా అలా అలా మత్తుకు బానిసగా మారాడు. మరో ఐదుగురు విద్యార్థులతో కలిసి మత్తు మందు తీసుకునేవాడు. అతని ప్రవర్తనలో మార్పు రావడంతో.. కొడుకు డ్రగ్స్కు బానిసయ్యాడనే విషయం తండ్రి తెలుసుకున్నాడు. వెంటనే లోకేష్ను స్కూల్ మాన్పించేశాడు.
మత్తు వదలలేక.. బతకలేక..
దాదాపు ఏడు నెలలుగా కుమారుడిని స్కూల్కు పంపకుండా మత్తుమందుకు దూరంగా ఉంచుతూ కాపాడుకుంటూ వస్తున్నారు ఆ తల్లిదండ్రులు. అయితే, మత్తుకు అలవాటుపడ్డ సాయి లోకేష్ మాత్రం దాన్ని వదలలేకపోయాడు. పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో మత్తుమందును పీల్చివాడు. అది కూడా దొరకకుండా ఆ తల్లిదండ్రులు పూర్తిగా కట్టడి చేయడంతో భరించలేకపోయాడు. మత్తు లేకుండా బతకలేకపోయాడు. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చి పోయాడు.
పోలీసులపై విమర్శలు!
ఆ స్కూల్లో చాలామంది విద్యార్థులకు మత్తుమందు అలవాటు ఉందని సాయి లోకేష్ తల్లిదండ్రులు అంటున్నారు. మత్తు మూలంగా తమ అబ్బాయిని కోల్పోయామని.. ఇంకా ఎవరికి ఇలాంటి దుస్థితి రాకూడదని విలపిస్తున్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విచారణ జరిపి కఠిన చర్యలు చేపట్టాల్సిన పోలీసులు మాత్రం.. సాయి లోకేష్ మృతదేహానికి పోస్ట్మార్టం చేసి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





