April 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP News : భర్త వేధింపులు…బిడ్డను చంపిన తల్లి
భర్త అనుమానిస్తూ వేధిస్తున్నాడనే మనస్తాపంతో

కన్నబిడ్డనే చంపేసింది ఓ తల్లి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఒకరిపై మరొకరి అనుమానాలకు ఓ చిన్నారి బలైపోయింది. భర్త అనుమానం వేధింపులను తట్టుకోలేని ఆ తల్లి బిడ్డ ప్రాణం తీసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

AP News : భర్త అనుమానిస్తూ వేధిస్తున్నాడనే మనస్తాపంతో కన్నబిడ్డనే చంపేసింది ఓ తల్లి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఒకరిపై మరొకరి అనుమానాలకు ఓ చిన్నారి బలైపోయింది. భర్త అనుమానం వేధింపులను తట్టుకోలేని ఆ తల్లి బిడ్డ ప్రాణం తీసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆరిలోవ సీఐ కథనం ప్రకారం జీవీఎంసీ 12వ వార్డు పరిధి పెదగదిలి దరి సింహగిరి కాలనీకి చెందిన గొర్లె వెంకటరమణకు శిరీషతో 2013లో వివాహమైంది. వెంకటరమణ ఏయూలో సీనియర్‌ అసిస్టెంట్‌

సుమారు 11 ఏళ్లు తర్వాత ఐదు నెలల కిందట వారికి పాప పుట్టింది. వెంకటరమణ కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. నిత్యం మాటలతో వేధిస్తుండేవాడు. ఆ తర్వాత వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. వెంకటరమణ భార్యపై అనుమానంతో బెడ్‌ రూమ్‌లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. నిత్యం ఆమె కదలికలను గమనించేవాడు. తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష ఈనెల 13న మంచంపై నిద్రిస్తున్న పాపను దిండుతో అదిమి చంపేసింది

Mother Killed A Child
ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి తెన్నేటిపార్కు తీరానికి పాప మృతదేహాన్ని తీసుకెళ్లింది. అక్కడ తెన్నేటి పార్కు దిగువున బంగ్లాదేశ్‌ నౌక చాటుకు వెళ్లి కుమార్తెను సముద్రం నీటిలో ముంచేసింది.  బయటకు వచ్చేసి భర్తకు ఫోన్‌ చేసింది. పాపతో తాను సముద్రంలోకి దిగగా కెరటాలు లోపలికి లాగేశాయని, ఒడ్డుకు వచ్చే సరికి పాప కళ్లు తెరవడం లేదని చెప్పింది. వెంటనే భర్త బీచ్‌కు చేరుకుని పాపను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు.

తర్వాత భార్యపై అనుమానంతో వెంకటరమణ ఆరిలోవ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్గం చేయగా ఊపిరాడక పోవడం వల్లే పాప చనిపోయినట్లు నివేదిక వచ్చింది. ఆరిలోవ పోలీసులు శిరీషను అదపులోకి తీసుకుని విచారించగా భర్త అనుమానిస్తుండడంతో క్షణికావేశానికి గురై పాపను దిండుతో అదిమి చంపినట్లు ఒప్పుకుంది. అనంతరం తాను కూడా సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అక్కడ సందర్శకులు కొందరు చూడటంతో ఆత్మహత్య వీలుపడలేదని తెలిపింది. శిరీషపై హత్య కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు

Also read

Related posts

Share via