లిక్కర్ స్కాం కేసు అప్డేట్స్ – గోవిందప్ప బాలాజీకి ఈనెల 20వరకు రిమాండ్
Govindappa Balaji Remand : ఏపీ మద్యం కుంభకోణం కేసులో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీకి విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 20వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయణ్ని అధికారులు విజయవాడ జైలుకు తరలించారు. వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన లిక్క్ స్కాంల కొల్లగొట్టిన రూ.వేల కోట్ల ముడుపుల సొత్తును డొల్ల కంపెనీలకు మళ్లించి అంతిమ లబ్ధిదారుకు చేర్చడంలో గోవిందప్ప బాలాజీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో 33వ నిందితుడిగా (ఏ33)గా ఉన్న గోవిందప్ప బాలాజీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయన చూస్తుంటారు. నెల రోజులుగా పరారీలో ఉన్న గోవిందప్ప బాలాజీ కోసం మూడు రాష్ట్రాల్లో సిట్ బృందాలు గాలించాయి. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్‌హిల్స్ అటవీ ప్రాంతంలో గోవిందప్ప బాలాజీ ఉన్నారని గుర్తించి అక్కడే మాటు వేశాయి.
AP Liquor Scam Updates : మంగళవారం నాడు ఉదయం 11 గంటల సమయంలో ఎరకనగడ్డె కాలనీలోని ఓ వెల్‌నెస్ సెంటర్ బయట గోవిందప్ప బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారంట్ నిమిత్తం ఆయన్ను ఎలందూరు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం విజయవాడకు తీసుకొచ్చి ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. బాలాజీ అరెస్ట్తో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది.
మరోవైపు లిక్కర్ కేసులో సజ్జల శ్రీధర్రెడ్డిని మూడు రోజుల పాటూ ఏసీబీ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 15, 16, 17 తేదీల్లో ఆయణ్ని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించారు. మద్యం కుంభకోణంలో కీలకంగా పనిచేసిన సజ్జల శ్రీధర్రెడ్టి ద్వారా మరింత సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.
అసలేం జరిగిదంటే : వైఎస్సార్సీపీ హయాం నాటి వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం జరిగింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కసిరెడ్డి ప్రతి నెలా రూ.50 నుంచి రూ.60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా జగన్‌కే చేర్చేవారు. ఈ విధంగా 2019-2024 మధ్య రూ.3200 కోట్ల మేర ముడుపులు దండుకున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025