March 13, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా..


సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలకు మీదకు తెచ్చుకున్నారు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. మృతులు ఒంగోలు, ప్రకాశం జిల్లాకు చెందిన తేజ్‌ కుమార్‌, గోపిగా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AP Crime: పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలో పంట కాలువలో ఈతకు దిగి ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డాడు. మృతుల్లో ఒకరు ఒంగోలుకు చెందిన తేజ్ కుమార్‌గా గుర్తింపు. మృతుడు AM రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో డిప్లొమా మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మరో విద్యార్థి ప్రకాశం జిల్లాకు చెందిన గోపి(22). నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్‌లో CSE థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. విద్దరు నరసరావుపేటలో మహేశ్వరి పిజి హాస్టల్ నందు స్నేహితులు. ఈ రోజు సాయంత్రం సమయంలో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు

ప్రాణం తీసిన ఈత..
విద్యార్థుల మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాలకు వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి వద్దకు చేరుకున్నారు. మంచిగా చదువుకుంటూ ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా మృతి చెందటంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.  విద్యార్థుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట రూరల్ పోలీసులు తెలిపారు

Also read

Related posts

Share via