April 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime: గుడివాడలో విషాదం.. పశువును తప్పించబోయి బోల్తా పడ్డ ఆటో.. మొత్తం 11 మంది..!


కృష్ణా జిల్లా నందివాడలో ఆటో బోల్తా పడిది. ఈ ప్రమాదంలో ఒకరి వ్యక్తి మృతి చెందగా..10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు కోసం వెంకటేశ్వరరావు (35)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AP Crime: కృష్ణా జిల్లా నందివాడ మండలంలో ఆటో బోల్తా పడిది. ఈ ప్రమాదంలో ఒకరి వ్యక్తి మృతి చెందగా..10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పుట్టగుంట గ్రామం దగ్గర రోడ్డుపై వస్తున్న పశువును తప్పించబోయి… అదుపు తప్పి ఆటో బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. మృతుడు కోసం వెంకటేశ్వరరావు (35)గా గుర్తించారు. గాయపడన 10 మంది క్షతగాత్రులను 108 వాహనం ద్వారా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించింగా.. మెరుగైన చికిత్సల నిమిత్తం ఇద్దరిని విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి డాక్టర్లు తరలించారు

గుడివాడలోని ఓ కార్పొరేట్ పాఠశాల హాస్టల్లో వంట పని ముగించుకొని.. అరిపిరాల గ్రామం వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటనపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నందివాడ పోలీసులు తెలిపారు

Also Read

Related posts

Share via