SGSTV NEWS online
Andhra PradeshCrime

AP Crime: ఏపీలో విషాదం.. ఒకే గదిలో తల్లి, కుమారుడి మృతి


కాకినాడలోని రేచర్లపేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే గదిలో తల్లి, కుమారుడి మృతి చెందారు. మృతురాలు రమ్యదీప్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Kakinada Crime News: కాకినాడ నగరంలోని రేచర్లపేట ప్రాంతంలో తల్లి, కుమారుడి అనుమానాస్పద మృతి సంచలనం రేపింది. ఒకే గదిలో మృతదేహాలు కనిపించడంతో  అంతా ఆందోళనకు గురయ్యారు. మృతులు రమ్యదీప్తి, ఆమె నాలుగేళ్ల కుమారుడు ప్రశాంత్‌ అని గుర్తించారు. రమ్యదీప్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ఆమె కుమారుడు ప్రశాంత్‌ మృతి తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


అనుమాన స్థితిలో తల్లి, కుమాడు మృతి:
చిన్నారి చేతులు, కాళ్లు, నోరు, ముక్కు అన్నింటికీ ప్లాస్టర్లు అంటించి ఉండడం వల్ల అనేక అనుమానాలు వస్తున్నాయి.  అయితే తల్లి, కూమాడిని ఎవరైనా హత్య చేశారా..?  లేక ఆత్మహత్య  చేసుకున్నా  అనే కోణంలో విచారణ చేస్తున్నారు. రమ్యదీప్తి రెండు నెలల క్రితం అబుదాబి నుంచి భారత్‌కు వచ్చినట్టు సమాచారం. ఆమె భర్త శరత్‌బాబు ప్రస్తుతం గల్ఫ్‌లోనే ఉంటున్నారు. కుటుంబంలోని పరిస్థితులు, భార్యాభర్తల మధ్య పరస్పర సంబంధాలు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు.

తల్లి, బాలుడి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు గురైతున్నారు. కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి, అనుబంధాల్లో బలహీనతలతో ఇలాంటి ఘోర పరిణామాలు ఏమైనా ఉన్నాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో పూర్తి నిజాలు బయటకు తీయాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలంటున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also read

Related posts