SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!


ఏపీలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా కావలిలో పట్టపగలే తాళాలు వేసిన ఇళ్లలోకి దూరి భారీగా దోచుకెళ్లారు. ఒకేరోజు నాలుగు ఇళ్లలో సుమారూ 70 సవరణల బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఏపీలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా కావలిలో పట్టపగలే తాళాలు వేసిన ఇళ్లలోకి దూరి భారీగా దోచుకెళ్లారు. ఒకేరోజు నాలుగు ఇళ్లలో సుమారూ 70 సవరణల బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

70 సవర్ల బంగార ఆభరణాలు
ఈ మేరకు డోర్ లాక్ చేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్ ఇందిరానగర్ జనతా పేట పలు ప్రాంతాలలో  గురువారం ఉదయం 10 గంటల నుంచి 12 గంట నాలుగు ఇళ్ల తాళాలు పగలగొట్టిలో చోరీ జరిగినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించగా 70 సవర్ల బంగార ఆభరణాలు 50వేల రూపాయలు నగదు కేజీ వెండి దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు.

స్వయంగా డీఎస్పీ శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకుని సిఐఎస్ఐ లతో కలిసి ఇల్లను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనతో కావలి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాధితులు తమ సొమ్ము ఇప్పించాలంటూ లబోదిబో అని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Also read

Related posts

Share this