December 18, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime: అనకాపల్లిలో ..ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య


నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న లాడ్జిలో ఆర్మీ ఉద్యోగి శివ అప్పలనాయుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శివ చనిపోవడానికి అప్పులు కారణమని కుటుంబ సభ్యులు తెలుపుతున్నట్లు నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు చెప్పారు.

Ap Crime: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న లాడ్జిలో ఆర్మీ ఉద్యోగి శివ అప్పలనాయుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాతవరం మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన బొచ్చా శివ అప్పలనాయుడు పదేళ్ల నుంచి ఆర్మీలో పని చేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఆయన జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాడు.

కొద్దిరోజులు క్రితం హైదరాబాద్ బదిలీ  మీద వచ్చాడు. మూడు సంవత్సరాల క్రితం విశాఖపట్నానికి చెందిన హేమలతతో శివకి పెళ్లి జరిగింది. ప్రస్తుతం రెండేళ్ల కుమార్తె వుంది.  అప్పలనాయుడు సెలవుపై గురువారం ఉదయం స్వగ్రామం నాతవరం మండలం మర్రిపాలెం వచ్చాడు.

సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో ఉన్నాడు. అక్కడి నుంచి నర్సీపట్నం వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా వున్న కె.ఎన్.ఆర్. లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు.

అయితే శుక్రవారం సాయంత్రం ఆరు గంటల వరకు కూడా గది తలుపులు తెరవకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి గది తలుపులు పగలకొట్టి చూశారు.లోపల అప్పలనాయుడు ఫ్యాన్ కి ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా టౌన్ సీఐ గోవిందరావు వచ్చి విచారణ చేపట్టారు.

శివ చనిపోవడానికి అప్పులు కారణమని కుటుంబ సభ్యులు తెలుపుతున్నట్లు నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు చెప్పారు. మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు

Also read

Related posts

Share via