ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ లో నష్టపోయి 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
పెద్దపల్లి పట్టణం: ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ లో నష్టపోయి 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరబోయిన సాయి తేజ (25) అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకొని గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతడికి ఇద్దరు పిల్లలు కాగా.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి రూ.10లక్షలకు పైగా అప్పులపాలయ్యాడు.
ఈ క్రమంలో మార్చి 18న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్సపొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ప్రస్తుతం సాయి తేజ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మంథనికి తీసుకొచ్చారు. ఈ ఘటనపె కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025