April 22, 2025
SGSTV NEWS
CrimeEntertainment

అల్లు అర్జున్‌పై మరో కేసు నమోదు?


కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని AISF ఆరోపించింది. కార్పొరేట్ సంస్థలకు హీరో అల్లు అర్జున్, శ్రీలీల బ్రాండ్ అంబాసిడర్‌, ప్రమోటర్లుగా వ్యవహరిస్తుండటంతో వీరిపై కేసు నమోదు చేయాలని AISF డిమాండ్ చేస్తోంది.

జేఈఈ మెయిన్స్ ర్యాంకులపై ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. టాప్ ర్యాంకులు మా కాలేజీలో వచ్చాయని తప్పుడు ప్రచారాలు చేస్తూ.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా మోసం చేస్తున్నాయి. ఈ తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వీటికి సంబంధించిన ఆధారాలను ఏఐఎస్ఎఫ్ కార్పోరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపైన, ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న అల్లు అర్జున్, శ్రీలీలపై చట్టపర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

కార్పోరేట్ విద్యా సంస్థల తప్పుడు ప్రచారం..
ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలపై వార్తా పత్రికల్లో టాప్ ప్రైవేట్ కాలేజీలు యాడ్స్ రిలీజ్ చేశారు. ఒక కాలేజీలో ఉన్న విద్యార్థిని వేరొక కాలేజ్ కూడా యాడ్ ఇచ్చింది. వేర్వేరు కాలేజీలు.. వేర్వేరు యాడ్‌లు.. వేర్వేరు ర్యాంకులు.. కానీ విద్యార్థి మాత్రం ఒక్కరే. టాప్ ర్యాంకర్ స్టూడెంట్లను కూడా ప్రైవేట్ యాజమాన్యాలు కొనుగోలు చేస్తున్నాయి. ఒక విద్యార్థి ఒకే కాలేజీలో ఎలా చదువుతాడని ప్రశ్నిస్తున్నారు.

కార్పోరేట్ విద్యాసంస్థలు ఇలా ర్యాంకుల పేరుతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్పోరేట్ విద్యా సంస్థలకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, శ్రీలీల ప్రమోటర్లుగా వ్యవహరించడం దారుణమని AISF విమర్శించింది. ఇలాంటి మోసపూరిత ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌, ప్రమోటర్లుగా ఉన్న వీరిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు

ప్రమోషన్ చేసే ముందు కనీసం విద్యా సంస్థలు మంచివా? చెడ్డవా? అని కనీసం ఆలోచించరని మండిపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖలు వెంటనే స్పందించి శ్రీలీల, అల్లు అర్జున్ పైన క్రిమినల్ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేసింది. వీరు చేసే తప్పుడు ప్రచారం వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపింది.

Also read

Related posts

Share via