*అంగరంగ వైభవంగా అన్నాభిషేకం*
 *ఆలమూరు* 
మార్గశిర మాస ఆరుద్ర నక్షత్రంతో కూడిన శివ ముక్కోటి పర్వదినం సందర్భంగా సోమవారం దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా ప్రఖ్యాతి చెందిన ఆలమూరు శ్రీ పార్వతీ సమేత భట్టీవిక్రమార్కేశ్వరస్వామివారి ఆలయంలో భట్టీశ్వరస్వామివారికి అంగరంగ వైభవంగా ఏకాదశవార అన్నాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. గ్రామస్తులు,దాతల, దేవాదాయ శాఖ వారి సంయుక్త సహాయ సహకారాలతో ప్రముఖ శైవాగమ పండితులు, టీటీడీ వార్షిక సన్మాన గ్రహీత, బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూరిపండు ఆధ్వర్యంలో కళ్యాణబ్రహ్మ వెలవలపల్లి చైతన్య కృష్ణ, కాలదారి కార్తికేయ, కాళ్ళకూరి నరేంద్ర శర్మ, సత్యవోలు సుబ్రహ్మణ్యం తదితర పండితుల చేతుల మీదుగా నిర్వహించిన ఈ అన్నాభిషేకాన్ని తిలకించడానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 7. 30 నిమిషాలకు ప్రారంభమైన అన్నాభిషేకం 11 గంటల వరకు జరిగింది. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తపేట జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్, ప్రముఖ పారిశ్రామికవేత్త వంటిపల్లి పాపారావు తదితర నాయకులు స్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. షేక్ ఖాసిం, యేరుకొండ విశ్వేశ్వరరావు, శిరిగినీడి వీరబాబు, చల్లా సతీష్ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి విస్తృతంగా కృషి చేశారు. పలువురు ప్రముఖులు, స్థానికులు, గృహస్తులు ఈ కార్యక్రమానికి ధన రూపంలో, వివిధ ద్రవ్య రూపంలో విరాళాలు అందించగా,మహిళా భక్తులు సేవ రూపంలో ఇతోధిక సహాయం అందించారు.
Also read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
 - శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
 - సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
 - ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
 - Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
 





