October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

భార్యపై కోపంతో అత్తారింటికి వెళ్లి.. మరదళ్లపై బావ అఘాయిత్యం

Eluru News.. భార్యా భర్తల బంధంలో గొడవలు మొదలైతే.. కుటుంబ మొత్తం డిస్ట్రబ్ అవ్వడంతో పాటు సమస్య తీవ్రతరం అయితే ఆ ప్రభావం వారందరిపై పడుతుంది. తాజాగా ఓ అల్లుడు.. అత్తింటిపై చేసిన అకృత్యానికి..

Also read :Andhra Pradesh: నడిరోడ్డుపైనే నరికి చంపేశారు..! పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు..!

నేడు వివాహ బంధం బలహీనంగా మారుతుంది. పెళ్లైన పదహారు రోజుల పండుగ కూడా కావట్లేదు భార్యా భర్తల మధ్య మనస్పర్థలు మొదలవుతున్నాయి. ఇవి కాస్త చినిగి చాటంతయ్యి, చాపంత అవుతున్నాయి. అంతలోనే పిల్లలు పుట్టడంతో బిడ్డల మొహం చూసుకుని కలహాల కాపురం చేస్తున్నారు దంపతులు. ఈ క్రమంలో ఇద్దరు ఒకరంటే ఒకరికి పొసగక నిత్యం గొడవలాడుకుంటూ ఉంటారు. ఇళ్లు ఒక రణరంగం, యుద్ద కాండగా మారిపోతుంది. భార్యా భర్తల మధ్య తగాదాలకు చిన్నారులు బలౌతున్నారు. భర్త భార్యపై గొడవ పడ్డ.. భార్యపై భర్త చేయి చేసుకున్న సమయంలో పిల్లలపై దాడులు జరుగుతున్నాయి. జీవిత భాగస్వామిపై ఉన్న కోపాన్ని ప్రదర్శిస్తున్నారు కొంత మంది పేరెంట్స్. దీంతో అభం, శుభం తెలియని చిన్నారులు బలౌతున్నారు.

Also read :Telangana: అర్ధరాత్రి దాటిందంటే గుడారంలో గుట్టుచప్పుడు యవ్వారం.. తెలిస్తే ఫ్యూజులౌట్

తాజాగా భార్య భర్తల మధ్య గొడవల వల్ల.. ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబులు నెలల పసికందుపై దాష్టీకానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని రావికమతం మండలంలోని కౌగుంట గ్రామానికి చెందిన చలపాటి బాలాజీ జార్ఖండ్‌లో సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. అతడికి ఏలూరు జిల్లా లింగపాలెం మండలం పచ్చనగరానికి చెందిన మహిళతో వివాహం అయ్యింది. అయితే భార్యా భర్తలకు మధ్య గొడవలు జరుగుతుండటంతో విడాకులు దరఖాస్తు చేసుకుంది. ఈ విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. ఈ క్రమంలో భార్య, మామ కోర్టు విచారణకు ఏలూరుకు వచ్చారు. అనంతరం వాళ్లు వెళ్లిపోతుంటే.. వెంబడించి.. ఏలూరు బైపాస్ సమీపంలో ఆ ఇద్దరిపై దాడి చేశాడు బాలాజీ. దీంతో వీరిద్దరూ ఆసుపత్రిలో చేరారు.

Also read :బిడ్డ కోసం.. జోరు వానలో తల్లి న్యాయ పోరాటం భర్త ఆమెను నానారకాలుగా హింసపెడుతుంటే..

అదే ఆవేశంలో లింగపాలెం మండలంలో ఉన్న అత్తగారింటికి వెళ్లాడు. ఓ ఉన్మాదిలా మారిపోయి ఇంట్లో ఉన్న అత్తను, ఇద్దరు మరదళ్లపై దాడి చేశాడు. కాన్పుకు వచ్చిన మరదల్ని తన వెంట తెచ్చుకున్న కర్రతో చితకబాదాడు. అలాగే ఉయ్యాల్లో ఉన్న మరదలి కుమారుడు రెండు నెలల చిన్నారిని కూడా కర్రతో కొట్టాడు. బిడ్డ స్పృహ తప్పిపడిపోవడంతో స్థానికులు సహాయంతో తల్లి హుటా హుటిన ఆసుపత్రికి తీసుకెళ్లింది. చింతల పూడి ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వీరిపై దాడి చేసి పారిపోతున్న కానిస్టేబుల్‌ను స్థానికులు పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేశారు. నిందితుడ్నిఅదుపులోకి తీసుకున్నామని.. ప్రస్తుతం ఏలూరులో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు

Also read :Telangana: బంధువుల నోటిదూలకు నవ దంపతులు బలి.. రైలు కిందపడి సూసైడ్‌!

Related posts

Share via