భర్తకు దగ్గరుండి మరీ మూడో పెళ్లి చేశారు ఓ ఇద్దరు మహిళలు. భర్త కోరికను నెరవేర్చడమే భార్యల విధి అనుకున్నారో ఏమో గానీ.. ఆయనకు పిల్లను వెతికి మరీ తమకు సవతిని తెచ్చుకున్నారు. ఈ ఘటన అల్లూరు జిల్లాలో గతవారం చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. తమ భర్త పెళ్లికి వీళ్లే ఆహ్వాన పత్రికలు వేయించారు
Also read :భర్త చనిపోవడంతో మరొకరితో వివాహేతర సంబంధం! కానీ, చివరకు భర్త తాగుబోతైనా.. జూదగాడైనా భార్య భరిస్తుంది కానీ.. తనకు పంచాల్సిన ప్రేమను మరొక మహిళకు పంచితే మాత్రం తట్టుకోలేదు. ఎన్ని కష్టాలనైనా ఓర్చుకుంటుంది కానీ.. సవతి పోరును అంగీకరించలేదు. భర్త జీవితంలోకి మరో స్త్రీ ప్రవేశించిందని ఏ భార్య సహించలేదు. ఈ విషయంలో ఆమె రాజీలేని పోరాటమే చేస్తుంది. కానీ, ఓ వ్యక్తికి మాత్రం అతడి ఇద్దరు భార్యలు దగ్గరుండి మరీ మూడో పెళ్లి చేయడం గమనార్హం. అతడికి మొదటి వివాహం కాగా.. మొదటి భార్య వల్ల సంతానం కలగకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా ఓ అబ్బాయిని కన్నాడు. 2007లో బాబు పుట్టగా.. ఆమె ఇప్పటి వరకూ మళ్లీ గర్బం దాల్చలేదు. అయితే, తనకు రెండో సంతానం కావాలని భర్త ఆశపడటంతో ఆయన ఇద్దరు భార్యలు మూడో పెళ్లి చేసి ఆయన కోరికను తీర్చారు. Also read :రాత్రికి రాత్రే మాయమవుతున్న చెట్లు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు..
విచిత్రమైన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెదబయలు మండలంలో కించూడు గ్రామానికి చెందిన పండన్న అనే వ్యక్తి ఇది వరకే రెండు వివాహాలు వివాహాలు. తొలుత పార్వతమ్మ అనే మహిళతో వివాహం కాగా ఆమెకు సంతానం కలగలేదు. పిల్లలు పుట్టలేదనే కారణంతో అప్పలమ్మ అనే మరో మహిళను పండన్న మనువాడాడు. ఈ దంపతులకు 2007లో ఒక బాబు పుట్టగా… ఆ తర్వాత అప్పలమ్మ మళ్లీ తల్లి కాలేదు. కానీ, తనకు ఇంకో సంతానం కావాలని భర్త కోరడంతో అతడి ఇద్దరు భార్యలు స్వయంగా పెళ్లి జరిపించారు.
Also read :ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కూతురు ఆ పని! నాన్నకి తెలిశాక!
లావణ్య అనే అమ్మాయిని చూసి సంబంధం ఖాయం చేశారు. వివాహానికి ఆహ్వాన పత్రికలను వేయించి.. భర్తకు మూడో పెళ్లి చేశారు. పెళ్లికి పెద్దలుగా ఇద్దరు భార్యలు వ్యవహరించి.. అంగరంగ వైభవంగా జూన్ 25న వివాహం జరిపించారు. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి పత్రికలో వధూవరుల ఫోటోతో పాటు తమ ఫోటోలను కూడా ఇరువురు భార్యలు వేయించడం గమనార్హం. అంతా తామై భర్తకు మూడో వివాహం చేసిన ఈ ఇద్దరు భార్యలది గొప్ప మనసుని కొనియాడుతున్నరు
Also read :విశాఖపట్నంలో మైనర్ బాలికపై అఘాయిత్యం.. పాత చట్టం ప్రకారమే చర్యలు.. ఎందుకో తెలుసా?
సతీ సుమతి కుష్టిరోగి అయిన తన భర్త కోసం వేశ్యను తీసుకొచ్చినట్టు పురాణాల్లో మాత్రమే చదువుకున్నామని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వివాహం గురించి సోషల్ మీడియాలో ఓ పెద్ద చర్చ జరుగుతోంది. రెండో సంతానం కావాలంటే మరో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందుని, ఇప్పుడు టెస్ట్‌ట్యూబ్, సర్వోగసీ వంటి ఎన్నో ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయిని, వాటి ద్వారా బిడ్డను కనొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also read :Hyderabad: వేరొకరితో చనువుగా ఉంటుందనీ.. మహిళను కారుతో ఢీకొట్టి హత్య చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి!