అది అత్యంత సెక్యూరిటీ ఉండే ప్రాంతం… తెల్లవారుజాము మూడు గంటలు దాటింది. ఆ ఇంటి ముందు ఒక్కసారిగా మంటలు ఎగసి పడుతున్నాయి. ఇంటి లోపల ఉన్న వారు ఆ మంటల వెలుగుకు ఉలిక్కిపడి లేచారు. మంటలు వ్యాపిస్తుండటంతో వెనుక వైపు నుండి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అర్థరాత్రి గుంటూరులో జరిగిన ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు మంటలు ఎలా వచ్చాయా అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
గుంటూరు నగరంలోని ఆకులవారితోటలో విజయవాడలోని ఎంప్లాయిమెంట్ ఆఫీస్ లో జేడిగా పనిచేస్తున్న చైతన్య నివసిస్తున్నారు. మే 16వ తేదీ రాత్రి ఆయన ఇంటిలోని మెయిన్ గేటు వద్దే మంటలు వ్యాపించాయి. దీనిపై పోలీసులకు చైతన్య ఫిర్యాదు చేశారు. మంటలు వ్యాపించడానికి ముందే పెట్రోల్ బాటిల్స్ విసిరి వేసినట్లుగా ప్రాథమిక ఆధారాలను పోలీసులు సేకరించారు. ముందుగా పెట్రోల్ బాటిల్స్ విసిరి వేసి ఆ తర్వాత నిప్పు పెట్టినట్లుగా భావిస్తున్నారు.
అయితే, చైతన్య కొద్దీ రోజుల క్రితం ఆ రోడ్డులో వస్తుండగా బైక్ పై వచ్చిన అతను కారును ఢీ కొట్టాడు. దీంతో చైతన్య ఆ వాహనదారుడితో గొడవ పడ్డాడు. కారు డ్యామేజ్ కావడంతో నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇద్దరి మద్య వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత సదరు వ్యక్తి తన బైక్ ను అక్కడే పెట్టి డబ్బులు తీసుకొస్తానని వెళ్లిపోయాడు. అప్పటి నుండి అతను తిరిగి రాలేదు. ఈ క్రమంలోనే ఇంటి ముందే మంటలు వచ్చాయి. దీనిపై చైతన్య బైకిస్ట్ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో తెల్లవారుజామున పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారుడిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. పోలీస్ బాస్ నివాసం అతి దగ్గరలోనే ఉండటంతో ఈ ఘటన మరింత కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం