February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Rajahmundry: కోటి ఆశలు ఉన్నోడు.. కుటుంబానికి ఆసరా అయినోడు.. అధికారుల తప్పిదంతో..



రాజమండ్రి గోరక్షణ పేట వై జంక్షన్ వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డుకి అడ్డంగా అండర్ గ్రౌండ్ ఐరన్ డ్రైనేజీ పైపులను వేయడంతో అవి కనిపించక.. బైక్ వస్తూ వాటిని ఢీకొట్టి 24 ఏళ్ల విజయ రూపస్ అనే యువకుడు తల పగిలి అక్కడక్కడే ప్రాణాలు విడిచాడు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అధికారుల నిర్లక్ష్యం 24 ఏళ్ల యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. అక్కడ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం తీసుకువచ్చిన డ్రైనేజీ పైపులను రోడ్డుకు అడ్డంగా వేశారు. ఈ విషయం తెలియని యువకుడు అటువైపు వచ్చాడు. రోడ్డుపై ఉన్న పైపులను గమనించక ఢీకొట్టాడు. దీంతో 24 ఏళ్ల విజయ్ రూపాస్‌ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాజమండ్రి గోరక్షణ పేట Y-జంక్షన్ దగ్గర జరిగిందీ ప్రమాదం.

ఎంబీఏ పూర్తి చేసిన యువకుడు విజయ్‌ మృతిపై సొంతూరు తుమ్మలోవలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు పనులు జరుగుతున్నాయని అధికారులు కనీసం హెచ్చరిక బోర్డు కూడా పెట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ రోడ్డుకి అడ్డంగా పైపులు వేస్తే అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని యువకుడి తండ్రి ప్రశ్నిస్తున్నారు.

ఎంబీఏ పూర్తి చేసి ప్రస్తుతం ఫ్లవర్ డెకరేషన్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు విజయ్. ఫ్లవర్ డెకరేషన్ పూల కోసం ఆర్టీసీ బస్టాండ్‌కి వెళ్తుండగా ఘటన జరిగినట్లు బంధువులు చెప్తున్నారు. చేతికి అందించిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు

Also read

Related posts

Share via