దొంగలు ఎక్కడ పడితే అక్కడ చేతివాటం చూపిస్తూనే ఉన్నారు.పబ్లిక్,ప్రైవేట్ ప్రాంతాలు అని వారికి సంబంధం లేదు. అదును దొరికితే చాలు సైలెంట్‌గా వారి పనిని వారు చేసుకుని దర్జాగా వెళ్తున్నారు.అందినకాడికి దోచుకొని వెళ్తున్నారు.తాజాగా కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో కిలేడీలు చేతివాటం ప్రదర్శించారు.
దొంగలు ఎక్కడ పడితే అక్కడ చేతివాటం చూపిస్తూనే ఉన్నారు.పబ్లిక్,ప్రైవేట్ ప్రాంతాలు అని వారికి సంబంధం లేదు. అదును దొరికితే చాలు సైలెంట్‌గా వారి పనిని వారు చేసుకుని దర్జాగా వెళ్తున్నారు.అందినకాడికి దోచుకొని వెళ్తున్నారు.తాజాగా కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో కిలేడీలు చేతివాటం ప్రదర్శించారు. బట్టలు కొనేందుకు వచ్చి కొన్నట్టే యాక్టింగ్ చేస్తూ,షాపులోని వర్కర్లను కాస్త పనిలో నిమగ్నం అయ్యేలా చేసి గుట్టుగా తన పని చేసుకుని వెళ్లారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మహిళా దొంగలు హల్చల్ చేశారు.వస్త్ర దుకాణాలను టార్గెట్ చేస్తూ నలుగురు మహిళలు ఒకే రోజు రెండు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు.ఇద్దరు మహిళలు ముందుగా దుకాణంలోకి వెళ్లి ఒకరు దుకాణ యజమానికి మాటలు చెబుతూ మరో మహిళా బట్టలు చూస్తుండగా మరొకరు వెనుక నుండి దుకాణంలో ఉన్న బట్టలను కట్టలు కట్టలు గా దొంగలించారు. అనుమానం వచ్చిన దుకాణ యజమాని మహిళను నిలదీయగా వారు దొంగతనం చేసిన బట్టలు ఒక్కసారిగా బయటపడ్డాయి.ఈ చోరీ మొత్తం సీసీ కెమెరాలు రికార్డు కావడంతో దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా మహిళలు ఇద్దరి దగ్గర వారు దొంగలించిన 20వేల రూపాయల విలువగల బట్టలను స్వాధీనం చేసుకొని,ఇద్దరు మహిళలను అరెస్ట్ చేయగ మరో ఇద్దరు పరారీకాగా,పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ మహిళలు గతంలో చాలాచోట్ల ఇలా వస్త్ర దుకాణాల్లో దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు
Also read
- Andhra News: బ్యాంకులో తనఖా పెట్టిన బంగారం విడిపించుకునేందుకు వచ్చిన ఖాతాదారుడు.. కట్ చేస్తే
- తస్మాత్ జాగ్రత్త..! మాయమాటలే పెట్టుబడి.. ఏకంగా లక్షల్లో సంపాదన..!
- వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మంచం కింద దూరిన వైసీపీ నేత ఇదిగో వీడియో
- ప్రదోష కాలం అంటే ఏంటి, ప్రదోష పూజ ఎలా చేయాలి?
- Weekly Horoscope: ఆ రాశి నిరుద్యోగులకు మంచి జాబ్ ఆఫర్స్.. 12 రాశుల వారికి వారఫలాలు