SGSTV NEWS
Andhra PradeshCrime

AP News: ఇష్టం లేని పెళ్లి.. భర్తకు ఫుల్‌గా మద్యం తాగించి.. ఆమె ఏం చేసిందంటే.!



తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య నిర్వాకం వెలుగు చూసింది. పిచ్చాటూరు మండలం జీఎన్ పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే కారణంగా భావించిన పోలీసులు అసలు కథ తేల్చారు. ఆ వివరాలు ఇలా..

నిండ్ర మండలం ఇరుగువాయికి చెందిన సుగంధికి పిచ్చాటూరు మండలం గజ సింగరాజాపురంకు చెందిన ఆంటోనీతో 12 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీళ్ళిద్దరికీ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లికి ముందే అరుల్ రాజ్ అనే యువకుడితో ప్రేమాయణం కొనసాగిస్తున్న సుగందికి ఇష్టం లేకుండానే పెద్దలు పెళ్లి చేశారు. పెద్దల చేసిన పెళ్లితో ఒకవైపు భర్త ఆంటోనీతో వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రియుడు అరుల్ రాజ్‌తో సుగంధి ప్రేమాయణం కొనసాగించింది. ఈ విషయం భర్త ఆంటోనీకి తెలిసి చాలాసార్లు మందలించాడు. అరుల్ రాజ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించిన సుగంధి తీరును నిలదీశాడు. ఈ మేరకు గొడవలు కూడా జరిగాయి. భార్య సుగంధి ప్రవర్తన మాత్రం మారలేదు. భార్య తీరు నచ్చని భర్త ఆంటోనీ అడ్డుగా ఉన్నాడని భావించి అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేసింది భార్య సుగంది. ఇంకేముంది పక్కా ప్లాన్ అమలు చేసింది. అడ్డుగా ఉన్న భర్తను కడతేరించేందుకు ప్రియుడు అరుణ్ రాజ్‌తో కలిసి ప్లాన్ చేసింది సుగంధి.

అంతా మద్యం మత్తులోనే..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త ఆంథోనీ మెడకు తాడు బిగించి హతమార్చి చనిపోయాడంటూ నాటకం ఆడిన సుగంధి వ్యవహారం బయటకు వచ్చింది. ముందు అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు. పొంతనలేని సమాధానం చెప్పిన భార్య సుగంధినే భర్తను చంపిన హంతకురాలిగా నిర్ధారించారు. ప్రియుడు అరుల్ రాజ్‌తో పాటు సుగంధిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. మద్యానికి బానిసైన ఆంటోనీని ప్రియుడు అరుల్ రాజ్ వెంట మద్యం సేవించేందుకు పంపిన సుగంధి మొత్తం ప్లాన్ అమలు చేసింది. ఈ నెల 25న రాత్రి 9 గంటల సమయంలో జిఎస్ పురం శివారు ప్రాంతంలోకి జన సంచారం లేని ప్రదేశంలోకి ఆంటోనీని తీసుకెళ్లి పీకలదాకా మద్యం తాగించారు.

ఆ తర్వాత ఆంటోనీని బైక్‌పై ఎక్కించుకుని తిరిగి ఇంటికి తీసుకొచ్చిన అరుల్ రాజ్ సుగంధితో కలిసి ప్లాన్ అమలు చేశాడు. వెంట తెచ్చిన తాడుతో మెడకు చుట్టి ఊపిరి పోయేంతవరకు బిగించి హతమార్చారు. సుగంధి, అరుల్ రాజ్ ఇద్దరూ అంటోని చనిపోయినట్టు నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి అరుల్ రాజ్ ఉడాయించగా.. సుగంది మాత్రం మద్యం కిక్ ఎక్కువై భర్త చనిపోయినట్లు డ్రామా ఆడింది. మద్యం మత్తులో భర్త చనిపోయాడని నానాయాగి చేసింది. ముందు అనుమానాస్పద మృతిగానే భావించిన పోలీసులు సుగంధిపై అనుమానం వచ్చి విచారించారు. పొంతన లేని సమాధానాలు చెబుతూ వచ్చిన సుగంధి నుంచి అసలు నిజాన్ని బయట పెట్టించారు. ప్రియుడుపై మోజుతో అడ్డుగా ఉన్న భర్తను హతమార్చింది భార్యనేనని తెలిసిన పోలీసుల ఇద్దరినీ అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించారు

Also read

Related posts

Share this