April 11, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

పరాయి వ్యక్తితో కనిపించిన భార్యను మందలించిన భర్త..తెల్లారేసరికల్లా..!

వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో జరిగింది. తమ అనైతిక బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. భర్తను హత్య చేసి గట్టుచప్పుడు కాకుండా తప్పుకునేందుకు ప్రయత్నించింది. ఈ సంఘటన మాచర్ల మండలం తాళ్లపల్లిలో చోటుచేసుకుంది. గురువారం(అక్టోబర్ 3) విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు నిందితుల గుట్టురట్టు అయ్యినట్లు మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాషా తెలిపారు.


సీఐ నఫీజ్ బాషా తెలిపిన వివరాల ప్రకారం మాచర్ల మండలం తాళ్లపల్లికి చెందిన ఓర్సు శివయ్య(32) స్థానిక పవర్ గ్రిడ్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. శివయ్య భార్య గాయత్రికి అదే గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి ఆమ్మోరయ్యతో వివాహం కాకముందే సాన్నిహిత్యం ఉంది. వారిద్దరూ పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు. అందుకు పెద్దలు ఒప్పుకోలేదని సీఐ వెల్లడించారు. ఈ క్రమంలోనే శివయ్యకు గాయత్రిని ఇచ్చి వివాహం జరిపించారు.

ఇదిలావుంటే, సెప్టెంబర్ 30వ తేదీన అర్ధరాత్రి సమయంలో గాయత్రి ,అమ్మోరయ్య ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో భర్త శివయ్య కంట పడ్డారు. దీంతో కంగారుపడ్డ గాయత్రి, అమ్మోరయ్యలు శివయ్యను దిండుతో మొహంపై ఉంచి ఊపిరి అడకుండా చేసి చంపేశారు. అనంతరం గుండెపోటుతో చనిపోయాడంటూ అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించింది గాయత్రి. అయితే, అనుమానం వచ్చిన మృతుని తల్లి విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో నిందితుల అసలు రూపం బయటపడింది. ఇద్దరు నిందుతులు గాయత్రి, ఆమ్మోరయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు

Also read

Related posts

Share via