February 2, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. పోలీసుల చేతిలో కీలక సమాచారం..!

 

విశాఖపట్నంలో సంచలనం రేపిన క్రికెట్ బెట్టింగ్‌ కేసులో కీలక అప్డేట్ సాధించారు పోలీసులు. టెక్నాలజీ ఉపయోగించుకుని ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో పెద్దవాల్తేరు డాక్టర్స్ కాలనీలో ఓ ఇంటిపై రైడ్స్ జరిపారు సైబర్ క్రైమ్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ప్రధాన నిందితుడు రవితోపాటు.. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.


విశాఖపట్నంలో సంచలనం రేపిన క్రికెట్ బెట్టింగ్‌ కేసులో కీలక అప్డేట్ సాధించారు పోలీసులు. టెక్నాలజీ ఉపయోగించుకుని ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో పెద్దవాల్తేరు డాక్టర్స్ కాలనీలో ఓ ఇంటిపై రైడ్స్ జరిపారు సైబర్ క్రైమ్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ప్రధాన నిందితుడు రవితోపాటు.. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ కోసం వినియోగిస్తున్న 80 బ్యాంక్ ఖాతాలు గుర్తించి.. రూ. 45లక్షలు ఫ్రీజ్ చేశారు. ఈ బ్యాంక్ ఖాతాలతో ఇప్పటివరకు 178 కోట్ల లావాదేవీలు నడిపినట్లు తెలుసుకున్నారు. బెట్టింగ్‌కి పాల్పడే నిర్వాహకులను ఎవరినీ వదిలిపెట్టబోమని సీపీ బాగ్చీ చెప్పారు.


2023లో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. విశాఖ నగరానికి చెందిన సత్తిబాబు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 8 లక్షలు నష్టపోయి పోలీసులను ఆశ్రయించడంతో సైబర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2023 సెప్టెంబర్‌లో బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసి 63 బ్యాంకు ఖాతాలను జప్తు చేశారు. 36 ఖాతాల నుంచి రూ.367 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అప్పటి నుంచి ప్రధాన నిందితుడిపై కన్నేసిన పోలీసులు.. తాజాగా అతడ్ని అరెస్ట్ చేశారు.


కరెంటు ఖాతాలను సృష్టించి భారీగా ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల చేతిలో మరికొంత మంది బుకీల సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది.. ప్రధాన నిందితుడు నుంచి వివరాలు రాబట్టిన పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు.. క్రికెట్ బెట్టింగ్‌ కేసులో ఇప్పటివరకు 11మంది నిందితుల అరెస్ట్ అయ్యారని పోలీసులు తెలిపారు



Related posts

Share via