ఫార్మా కెమికల్ పరిశ్రమలు ఇప్పుడు దడ పుట్టిస్తున్నాయి… కార్మికులు, ఉద్యోగుల్లో ఆందోళన నింపుతున్నాయి.. వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు కార్మికులు. తాజాగా పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది..
అనకాపల్లి పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ విజయశ్రీ ఆర్గానిక్స్ లో ప్రమాదం జరిగింది. ఏఎన్ఎఫ్ బ్లాక్ లో కెమికల్స్ దించుతున్న సమయంలో ప్రమాదం సంభవించింది. డ్రయర్ లో ఉన్న ప్రోడక్ట్ ను బయటికి తీసే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా కెమికల్ పౌడర్ విధుల్లో ఉన్న ఇద్దరు కార్మికులపై కెమికల్ పడింది. ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన ఘటన తెలిసి మిగిలిన కార్మికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం తెలుసుకున్న మిగిలిన పరిశ్రమల కార్మికులు పరుగులు తీశారు. క్షతగాత్రులను.. హుటాహుటిన హాస్పిటల్ తరలించారు.
వీడియో ఇక్కడ చూడండి..
జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిలో పరవాడ మండల బాపడుపాలెం గ్రామానికి చెందిన చక్రపాణి సత్య వెంకట సుబ్రహ్మణ్యస్వామి కాగా, మరొకరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రజాక్. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. పది రోజుల క్రితం ఠాగూర్ ఫార్మా లో విషవాయువులు లీకై తీవ్ర అస్వస్థత ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.