రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శిరో ముండనం కేసులో శుక్రవారం తుది తీర్పు వెల్లడికానుంది. అప్పట్లో ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెం శిరో ముండనం కేసు కొలిక్కి రానుంది. ఈనేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టిన విశాఖ ఎస్సి, ఎస్టి ప్రత్యేక కోర్టులో తుది తీర్పు వెలువరించనుంది. ఈ విషయాన్ని బుధవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.
1996 డిసెంబరు 29న జరిగిన శిరోముండనం ఘటన
1996 డిసెంబరు 29న జరిగిన శిరోముండనం కేసులో విచారణ బుధవారం పూర్తయింది. ఏప్రిల్ 12న తీర్పు వెలువరిస్తామని విశాఖ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తెలిపారు. రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ కేసులో ప్రధాన నిందితుడు కాగా, మరో 8 మంది నిందితులు ఉన్నారు. ప్రధాన సాక్షి కోటి రాజు (58) ఇటీవల మృతిచెందారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రధాన బాధితుడు కోటి చినరాజుకు ఆయన సోదరుడు. బాధితులు ఐదుగురిలో ఇద్దరు మరణించారు. గత ఏడాది బాధితుడు పువ్వల వెంకటరమణ మృతిచెందారు. 15 మంది సాక్షుల్లో ఇద్దరు చనిపోయారు. శిరోముండనం కేసు నమోదై ఇప్పటికీ 28 సంవత్సరాలు పూర్తి కావడంతో న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు బాధితులు. నిందితులు పలు వివాదాలతో ఈ కేసును అనేక సార్లు వాయిదాలు వేస్తూ వచ్చారు. దీంతో ఏప్రిల్ 12న వెలువడే తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
Also read
- Andhra: స్టూడెంట్ బ్యాగ్లో లిక్కర్ బాటిల్.. కట్ చేస్తే, ఎంత ఘోరం జరిగిందో తెలుసా..?
- రూ. 1500 లంచం కేసులో 13 ఏళ్ల విచారణ.. సంచలన తీర్పునిచ్చిన ఏసీబీ కోర్టు
- కన్న కొడుకుపై స్టేషన్ మెట్లెక్కిన వృద్ధ దంపతులు.. విషయం తెలిసి పోలీసులే షాక్!
- Crime: నాతో వచ్చినవారు.. నాతోనే పోతారు!
- Sowmya Shetty : రెండో భార్యగా ఉంటానంటూ కోట్లు దోచేసింది.. బాధితులు లబోదిబో