SGSTV NEWS
Andhra Pradesh

Tirumala: తిరుమలలో కల్తీ ఫుడ్ కలకలం.. పలు హోటళ్లని తనిఖీ చేసిన ఈవో.. నాణ్యతలేని వస్తువులు, పాడైన కూరగాయలను చూసి షాక్‌

పవిత్రమైన తిరుమలలో ఆహార పదార్థాల కల్తీ భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తిరుమలలోని హోటల్స్‌లో టీటీడీ ఈవో శ్యామలరావు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధానంగా.. కౌస్తుభంలోని బాలాజీ రెస్టారెంట్‌లో భక్తులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. హోటల్‌లోని ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్రపరచడం లాంటి పద్ధతులను పరిశీలించారు. ఈ క్రమంలోనే.. బంగాళదుంపలు, కాలీఫ్లవర్‌తోపాటు మరికొన్ని కూరగాయలు కుళ్లిపోగా.. కొన్ని కిరాణా వస్తువుల గడువు ముగిసిపోయినట్లు గుర్తించారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు. అంతేకాదు.. పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలు కూడా నాసిరకంగా ఉన్నట్లు తేల్చారు. నాణ్యత లేని ఆహారం, పాడైన పదార్థాలను భక్తులకు అందిస్తుండడంతో వాటి శాంపిల్స్‌ సేకరించి.. టెస్టుల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. గడువు ముగిసిన వస్తువులను సీజ్‌ చేశారు. ఇక.. యాత్రికుల ఫిర్యాదుతో పలు హోటల్స్‌లో తనిఖీలు చేశామని చెప్పారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు.

Also read :Andhra Pradesh: ‘పిల్లలూ.. మీరు అల్లరి చేస్తే నేను చచ్చిపోతా..!’ బెదిరిద్దామనుకున్నాడు.. కానీ అంతలోనే..

తిరుమలలోని హోటల్స్‌లో కల్తీ సరుకులతో తయారు చేసిన ఆహారపదార్థాలు దర్శనమివ్వడం అధికారులకు షాకిచ్చింది. రేషన్ బియ్యంతో వండిన అన్నం, కల్తీ నూనెతో తయారు చేసిన వంటకాలు చూసి నిర్వాహకులపై సీరియస్ అయ్యారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు. కల్తీ వస్తువుల గుర్తించిన హోటల్స్‌పై కేసులు నమోదుకు ఆదేశించారు. హోటల్ నిర్వాహకులు నిబంధనలను పాటించడం లేదని, అపరిశుభ్రంగా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని తెలిపారు.

Also read :Andhra Pradesh: తిరుపతిలో ఒకే కుటుంబంపై కత్తులతో దాడి.. వృద్ధురాలు మృతి, బాలిక సీరియస్..!

ఇకపై నాసిరకం ఫుడ్ పెట్టినా, కల్తీ ఆహార పదార్థాలు వాడినా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో ఫుడ్‌ కల్తీ ప్రక్షాళనే లక్ష్యంగా రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు. మరోవైపు.. తనిఖీల తర్వాత.. ఎఫ్‌ఎస్‌డీ డైరెక్టర్‌తో కలిసి మొబైల్ ల్యాబ్‌ను ప్రారంభించారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఈ ప్రత్యేకమైన మొబైల్ ల్యాబ్‌లో 80 రకాల పదార్థాల నాణ్యతలను తనిఖీ చేస్తుందన్నారు

వీడియో..

Also read :ఆస్తి తగదాల నేపథ్యంలో ఓ ఇంటిని పట్రోల్ పోసి తగలబెట్టిన యువకుడు

Related posts