అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి సరిహద్దు మండలాలైన కొయ్యూరు మండలం మాలపేట పంచాయతీ జాజుల బంద, పెద్దగరువు, పిత్ర గడ్డ, నీళ్ల బంధ. నాలుగు గ్రామాల్లో 100 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. పివిటిజీ తెగకు చెందిన 250 మంది జనాభా జీవిస్తున్నారు. జాజులబంద వెళ్లాలి అంటే జాజులు బంద అనే కొండ గ్రామానికి ఆరు కిలోమీటర్లు నడవాలి. ఈ గ్రామాలకు కనీస సౌకర్యాలు లేవు. రోడ్లు, మంచినీళ్లు అందుబాటులో ఉండవు. ఈ ప్రాంతాలవైపు అధికారులు కన్నతైనా చూడరు. తాగు నీటి కోసం కిలోమీటర్లు నడవాల్సిందే అంటున్నారు గ్రామస్థులు.
Also read :సెల్ ఫోన్ కోసం యువతి దారుణం.. అసలు ఏం జరిగిందంటే?
అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి సరిహద్దు మండలాలైన కొయ్యూరు మండలం మాలపేట పంచాయతీ జాజుల బంద, పెద్దగరువు, పిత్ర గడ్డ, నీళ్ల బంధ. నాలుగు గ్రామాల్లో 100 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. పివిటిజీ తెగకు చెందిన 250 మంది జనాభా జీవిస్తున్నారు. జాజులబంద వెళ్లాలి అంటే జాజులు బంద అనే కొండ గ్రామానికి ఆరు కిలోమీటర్లు నడవాలి. ఈ గ్రామాలకు కనీస సౌకర్యాలు లేవు. రోడ్లు, మంచినీళ్లు అందుబాటులో ఉండవు. ఈ ప్రాంతాలవైపు అధికారులు కన్నతైనా చూడరు. తాగు నీటి కోసం కిలోమీటర్లు నడవాల్సిందే అంటున్నారు గ్రామస్థులు. రోగమొచ్చినా రోస్టొచ్చినా డోలి మోత మోయాల్సిందే. ఏళ్లుగా సమస్య కోసం పోరాడుతున్న ఫలితం లేకుండాపోయిందంటున్నారు గ్రామస్థులు. దీంతో ఇక తాడోపేడో తెలుసుకోవాలని సిద్ధమయ్యారు ఆ గిరిజనులు. నాలుగు గ్రామాల ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు. తమ గోడు ఆలకించండి మహాప్రభో అంటూ నిరసన తెలిపారు. మోకాళ్లపై కూర్చొని నిరసన ప్రదర్శన చేశారు.
Also read :బ్రహ్మ కోరికతో ఓం కార రూపంలో వెలసిన శివయ్య.. కేవలం దర్శనంతోనే కోరిక నెరవేరుతుంది.. ఎక్కడంటే..
ఆ గ్రామం ఇంకా చీకట్లోనే..
విద్యుత్ లేక రాత్రిపూట అంధకారంలోనే ఆ గిరిజనులు మగ్గిపోతున్నారు. ప్రభుత్వ సహాయం పొందేందుకు వెళ్లాలంటే కిలోమీటర్ల మేర నడవాల్సిందే. రేషన్ బియ్యం, వైద్య సేవలు, అంగన్వాడీ సేవల కోసం వెళ్లాలంటే రానుపోను 18కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. దీంతో 2021లో దాదాపు 100 కుటుంబాలు కలిసి చందాలు వేసుకొని ఏడు కిలోమీటర్ల వరకు రోడ్డు వేసుకున్నారు. అనేకసార్లు ఆందోళన చేసిన తర్వాత 2023లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మెటల్ రోడ్డు మంజూరైంది. కానీ ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. స్కూలు ఉంది కానీ టీచర్ వచ్చేందుకు భయపడుతున్నారని ఆవేదన చెందుతున్నారు గ్రామస్తులు. దీంతో ఇక చేసేదేంలేక.. ఆందోళనకు సిద్ధమయ్యారు గిరిజనులు. జూలై 27 తేదీలోగా పనులు ప్రారంభించక పోతే జిల్లా జడ్పీ సమావేశం పాలకవర్గం వద్ద డోలీలు కాగడాల పట్టుకొని నిరసన తెలియజేయాలని నిర్ణయించామని అంటున్నారు గిరిజనులు.
వీడియో..
Also read :బ్రహ్మ కోరికతో ఓం కార రూపంలో వెలసిన శివయ్య.. కేవలం దర్శనంతోనే కోరిక నెరవేరుతుంది.. ఎక్కడంటే..
Jagan Raghurama : .ఏపీ అసెంబ్లీ హాల్లో జగన్ను రఘురామ పలకరించింది ఇందుకా..!?