ఓ గ్రామంలోని ఆలయం నుంచి అర్ధరాత్రి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. స్థానికులకు అవి వినిపించినా.. ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక పూజారి ప్రతి రోజూలానే తెల్లారి గుడికెళ్లేసరికి.. అక్కడ కనిపించిన సీన్‌తో దెబ్బకు అవాక్ అయ్యాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బేస్తవారిపేట మండలం మోక్షగుండంలో పురాతన ముక్తేశ్వరాలయం ఒకటి ఉంది. శనివారం అర్ధరాత్రి ఆ ఆలయంలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఆలయ ప్రాంగణంలోని నంది విగ్రహాన్ని పెకలించి.. దాని కింద గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఆదివారం ఉదయాన్నే పూజారి ఆలయానికి వెళ్లి చూడగా.. అక్కడ కనిపించిన దృశ్యానికి దెబ్బకు షాక్ అయ్యాడు. గుప్త నిధుల కోసం ఎవరో ఇలా చేశారని గుర్తించి.. వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి.. దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఆలయంలో ఇలా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్టు తెలిసి.. అది ఆ నోటా.. ఈ నోటా పాకడంతో స్థానికంగా కలకలం రేపింది.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




