అర్ధరాత్రి 12 కాగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.. అంతా ఒకవైపు సంబరాల్లో మునిగి తేలుతుంటే.. ఇంతలో ఓ వ్యక్తి క్రాకర్స్ కాల్చేందుకు ముందుకు వెళ్లాడు.. అంతలోనే ఒక్కసారిగా జనం పరుగులు.. అసలేం జరిగిందో అర్థం కాలేదు..
ఎక్కడ చూసినా న్యూ ఇయర్ జోషే.. అంతా హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.. తెలుగురాష్ట్రాల్లో కొత్త ఏడాదికి స్వాగతం చెబుతూ వేడుకలు ఘనంగా జరిగాయి.. కొత్త సంవత్సరానికి అందరూ ఎంతో సంతోషంగా ఆహ్వానం పలికితే.. ఓ కుటుంబం మాత్రం తీరని విషాదంతో శోకసంద్రంలో మునిగిపోయింది.. అర్ధరాత్రి 12 కాగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.. అంతా ఒకవైపు సంబరాల్లో మునిగి తేలుతుంటే.. ఇంతలో ఓ వ్యక్తి క్రాకర్స్ కాల్చేందుకు ముందుకు వెళ్లాడు.. అంతలోనే ఓ క్రాకర్ నుదిటికి తగలంతో తీరని విషాదం ఏర్పడింది..
వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం కూర్మన్నపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్లపూడి ప్రాంతం.. రజక వీధిలో స్థానికులంతా వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేషన్లలో మునిగిపోయారు. 31వ తేదీ నైట్ కావడంతో అంతా ఆనందంగా గడిపారు. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు అంతా సిద్ధమవుతూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఈలోగా అర్ధరాత్రి 12 గంటలయింది.. ఒక్కసారిగా అందరిలో కేరింతలు.. ఒకరినొకరు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ సరదాగా గడిపారు.. కేక్ కట్ చేస్తూ వేడుకలు చేసుకున్నారు. పిల్లలు పెద్దలు మహిళలు అంతా సెలబ్రేషన్లలో మునిగిపోయారు. కేక్ కట్ చేసిన తర్వాత.. క్రాకర్స్ కాల్చేందుకు సిద్ధమయ్యారు.
ఈలోగా.. సుధమల శివ అనే వ్యక్తి క్రాకర్స్ షాట్స్ కాల్చారు.. ఈ లోగా ఏమైందో ఏమో కానీ.. క్రాకర్స్ తో శివ నుదుటికి తీవ్ర గాయం అయింది. వెంటనే కుప్పకూలిపోయాడు శివ. దీంతో సెలబ్రేషన్స్ లో ఉన్న వారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.. హుటా హుటిన శివను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు. అప్పటికే శివ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది.. ఆ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
Also Read
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే
- వీడెక్కడి మొగుడండీ బాబూ.. నిద్రపోతుంటే భార్య మెడలో తాళి ఎత్తుకెళ్లాడు..!
- తెలంగాణ: కూతురు కోసం ఆ మాజీ పోలీస్ అధికారి ఏం చేశాడంటే…?