November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

10 రోజుల క్రితమే సొంతూరికి వచ్చింది.. అంతలోనే దారుణం..!

అందరు సంతోషంగా ఉండాలని భావిస్తుంటారు. అయితే అనుకోకుండా జరిగే కొన్ని ప్రమాదాలు కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతాయి. పది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది.. అయితే ఆ సంతోషం లో ఉండగానే ఘోరం జరిగింది.

ప్రతి ఒక్కరి తమ సొంతూరుపై ఎంతో అభిమానం,ప్రేమ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు పెళ్లై అత్తారింటికి వెళ్లిన తరువాత పుట్టింటికి వెళ్తున్నాము అంటే ఎక్కడ లేని సంతోషంగా వస్తుంది.  అలానే కొందరు మహిళలు తమ భర్త వాళ్ల గ్రామంలో పనులు లేక తమ అమ్మాగారి ఊరికి వెళ్తుంటారు. అలానే వివాహిత కూడా ఉపాధి కోసం భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి తాను పుట్టిన ఊరికి వెళ్లింది. అలా వెళ్లిన 10 రోజులకే దారుణం చోటుచేసుకుంది. దీంతో ఆ ముగ్గురు పిల్లలు తల్లిలేని అనాథలు అయ్యారు. మరి.. అసలు ఏం జరిగింది? . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

ప్రకాశం జిల్లా తాళ్లు మండలంలోని బొద్దికూరపాడు గ్రామానికి చెందిన కొప్పుల రామకృష్ణ, గోవిందమ్మ అనే దంపతులు ఉన్నారు. వీరికి రాజ్యలక్ష్మి అనే కుమార్తె ఉంది. ఆమెను పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి చెందిన గడ్డం థామస్ కి ఇచ్చి వివాహం చేశారు. వీరి వివాహం 29ఏళ్ల క్రితం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చాలా కాలం పాటు అత్తగారి ఊరిలోనే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవలే పది రోజుల కిందట ఆమెతో పాటు భర్త, రెండో కుమార్తెను తీసుకుని అమ్మగారి ఊరైన బొద్దికూరపాడుకు వచ్చారు

ఇక ఖాళీగా ఉండడం ఇష్టం లేక..కూలి పనికి వెళ్తే కుటుంబానికి ఆదరువుగా ఉంటానని భావించింది. ఈ క్రమంలోనే ఆ దంపతులు ఇద్దరు పది రోజులుగా నిత్యం ఏదోక ముఠా తరపున కూలి పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కూడా కూలి పనులకు వెళ్లేందుకు రాజ్యలక్ష్మి సిద్ధమైంది. రాజ్యలక్ష్మి, తన కుమార్తె, భర్తతో పాటు మరో పదిహేను మందితో కలసి దాసరి రమణమ్మ అనే మహిళ ముఠాతో వెళ్లారు. ఆ ముఠా తరపున గుజ్జుల కోటిరెడ్డికి సంబంధించిన ట్రాక్టరులో పొలం వద్దకు వెళ్తున్నారు.

అయితే ఆ డ్రైవర్ అజాగ్రత్తగా ట్రాక్టరు నడపడంతో కుదుపులలో డోరు విరిగిపోయింది. దీంతో దానినిపై కూర్చొని ఉన్న ముగ్గురు కిందపడిపోయారు. అ క్రమంలో రాజ్యలక్ష్మిపైకి టైరు ఎక్కడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఇక ఈ ఘటనపై మృతురాలి భర్త థామస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలా ఇటీవల ఓ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఆరు మంది బలయ్యారు.  కంటైనర్ డ్రైవర్ అకస్మాత్తుగా వాహనాన్ని మలుపు తిప్పగా వెనుకనే వస్తున్న కారు డీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది దుర్మరణం చెందారు. ఇలా కొందరు డ్రైవర్లు చేసే తప్పుకు అమాయకులు బలవుతుంటారు.

Also read

Related posts

Share via