తిరుమలలో స్టార్ హోటల్ నిర్మాణం కొనసాగుతుండడంతో…ఏపీ సాధు పరిషత్ మరోసారి ఆందోళనకు దిగింది. ఇందులో భాగంగానే టీటీడీ పరిపాలనా భవనం ముందు ఆమరణ దీక్షకు దిగారు శ్రీనివాసానంద స్వామి. సనాతన ధర్మ పరిరక్షణ అంటే పవిత్రమైన స్థలంలో స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతించడమా… తిరుమల ప్రక్షాళన అంటే అపవిత్రం చేయడమా…అంటూ సాధువులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ గళమెత్తారు.
టెంపుల్ సిటీలో ముంతాజ్ స్టార్ హోటల్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. తిరుమల శ్రీవారి దివ్య క్షేత్రంలో స్టార్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, సాధువులు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష మంటలు రేపుతోంది. ఈ నేపథ్యంలో ఒబెరాయ్ గ్రూప్‌కి కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. అయితే స్టార్ హోటల్ నిర్మాణం మాత్రం రూ. 250 కోట్ల ఖర్చుతో శరవేగంగా సాగుతోంది. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందని రోడ్డెక్కిన ఏపీ సాధు పరిషత్ ఆమరణ దీక్షతో ప్రభుత్వం దిగి వస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.
అసలు అలిపిరి పరిధిలో ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణంపై వివాదమేంటో చూద్దాం.
👉 తిరుమల శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణం
👉 అలిపిరికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ నిర్మాణం
👉 శేషాద్రి పర్వతం అంచున స్టార్ హోటల్ నిర్మాణంపై వివాదం
👉 2021లో ఒబెరాయ్ గ్రూపునకు 20 ఎకరాలు కేటాయించిన అప్పటి సర్కార్
👉 గత ఏడాది ఆగస్టులో ముంతాజ్ హోటల్ పేరుతో బోర్డు ప్రత్యక్షం
👉 దీనికి వ్యతిరేకంగా ఏపీ సాధు పరిషత్ ఆందోళన
👉 2 రకాల అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న సాధు పరిషత్
👉 ముంతాజ్ హోటల్ పేరుతో నిర్మాణం ఏంటని ప్రశ్నిస్తున్న స్వామీజీలు
👉 ఫైవ్ స్టార్ హోటల్ కట్టడంపై రెండో అభ్యంతరం
👉 తిరుమల పవిత్రత, ఆధ్యాత్మికత దెబ్బ తింటాయని అభ్యంతరం
👉 2007 నుంచి ఈ ప్రాంతం అంతా శ్రీవారి దివ్యక్షేత్రంగా పరిగణింపు
ఇదే అంశంపై తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ముందు గత ఏడాది నవంబర్‌లో సాధువులు ఆందోళన చేశారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ పరిధిలో జరుగుతున్న ముంతాజ్ హోటల్స్ నిర్మాణం అక్రమమని నోటీసులు జారీచేసిన “తుడ” తిరిగి డిసెంబర్ 30, 2024లో ట్రిడెంట్ హోటల్స్ పేరుతో నిర్మాణానికి ఓకే చెప్పింది. ఈ మేరకు అనుమతులు ఉన్నాయని చెబుతూ స్టార్ హోటల్ నిర్మాణం తిరిగి ప్రారంభమైంది.
గతంలో ఇదే స్థలాన్ని 2014-19 మధ్య అప్పటి చంద్రబాబు సర్కార్..దేవలోకం ప్రాజెక్టుకు కేటాయించింది. ఆ తర్వాత వచ్చిన జగన్ సర్కార్..దీనిలో 20 ఎకరాలను ఒబెరాయ్ గ్రూపునకు కేటాయించింది. వాళ్లే ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
అలిపిరికి అతి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణం జరుగుతోంది. దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలని సాధువులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ముంతాజ్ హోటల్‌కి అనుమతులు రద్దు చేసిన తుడా..మళ్లీ దాని నిర్మాణానికి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు సాధువులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
స్టార్ హోటల్ నిర్మాణం కొనసాగుతుండడంతో…ఏపీ సాధు పరిషత్ మరోసారి ఆందోళనకు దిగింది. ఇందులో భాగంగానే టీటీడీ పరిపాలనా భవనం ముందు ఆమరణ దీక్షకు దిగారు శ్రీనివాసానంద స్వామి. సనాతన ధర్మ పరిరక్షణ అంటే పవిత్రమైన స్థలంలో స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతించడమా… తిరుమల ప్రక్షాళన అంటే అపవిత్రం చేయడమా…అంటూ సాధువులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ గళమెత్తారు. ఇక టీటీడీ బోర్డు కూడా… గత ఏడాది నవంబర్‌లో ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తీర్మానం కూడా చేసింది. అయితే ఇవేమీ పట్టించుకోని ఒబెరాయ్ గ్రూప్ తిరుమల కొండకు అనుకుని ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణాన్ని కొనసాగిస్తుండడాన్ని స్వామీజీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఈ వివాదానికి ఎండ్ కార్డ్ ఎలా పడుతుందో చూడాలి
Also read
- Hyderabad: వేకువజామున నీళ్లు కావాలని ఇంట్లోకి దూరాడు.. ఆమె లోపలికి వెళ్లగానే..
- ఆడ వేషంలో పెళ్లైన ప్రియురాలి ఇంటికి బాయ్‌ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- Telangana: మటన్ కర్రీ వండలేదన్న పాపానికి.. భర్త ఏం చేశాడో చూస్తే దిమ్మతిరుగుద్ది.!
- Andhra News: పాపం పెద్దావిడ తిరుపతి వెళ్లేందుకు బస్సు ఎక్కింది.. లీలగా మాయ చేసి..
- Telangana: ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థిని.. ఒక్కసారిగా శబ్దం.. ఏమైందంటే..?