February 23, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: తిరుమల డీఎస్పీ కోళ్ల పెంపకం.. కట్‌ చేస్తే.. వేటుకు రంగం సిద్ధం

తన వాహన డ్రైవర్‌గా పనిచేసే హోంగార్డును ఒక రోజంతా వేడెక్కేలా డ్రైవ్ చేయించి, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి తనను హత్య చేయడానికి ప్రయత్నించాడంటూ ఆ హోంగార్డుపై కేసు పెట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి, ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే టీటీడీ డెప్యూటీ ఈవోతో సహా 40 మంది పై కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.


తిరుమల డీఎస్పీగా పనిచేసిన టిటి ప్రభాకర్ బాబు పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలకు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఆగష్టు నుండి 2020 నవంబర్ వరకు తిరుమల డీఎస్పీగా సేవలందించిన ప్రభాకర్ బాబు, తన విధుల్లో అనేక వివాదాస్పద చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ బాబు, తిరుమలలోని కాటేజీల మధ్య తనకు కేటాయించిన వసతిగృహంలో కోడి పుంజులను పెంచినట్లు గుర్తించారు. ఈ కోడి పుంజుల అరుపులు మరియు విసర్జితాలతో భక్తులకు ఇబ్బందులు కలగడంతో, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అదనంగా, కోళ్ళకు స్నానాలు చేయించి, దాణా పెట్టేందుకు కానిస్టేబుళ్లను వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పాల బిల్లు అడిగినందుకు..

పాల బిల్లు అడిగినందుకు వాహనం పై 2 వేల జరిమానా విధించారు.  తన నివాసానికి పాలు సరఫరా చేసే వ్యక్తికి 9 నెలల పాటు బిల్లు చెల్లించకపోవడం, అడిగినందుకు అతని వాహనంపై 2,000 రూపాయల జరిమానా వేయించడం వంటి చర్యలు కూడా ఆయనపై ఆరోపణలుగా ఉన్నాయి.

తన వాహన డ్రైవర్‌గా పనిచేసే హోంగార్డును ఒక రోజంతా వేడెక్కేలా డ్రైవ్ చేయించి, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి తనను హత్య చేయడానికి ప్రయత్నించాడంటూ ఆ హోంగార్డుపై కేసు పెట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి, ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే టీటీడీ డెప్యూటీ ఈవోతో సహా 40 మంది పై కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం

ఈ ఆరోపణలపై ప్రభాకర్ బాబు 15 రోజుల్లోగా లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన జీఓలో పేర్కొంది. ప్రస్తుతం, ప్రభాకర్ బాబు అదనపు ఎస్పీ హోదాలో వీ ఆర్ లో ఉన్నారు.

Also read

Related posts

Share via