June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: బాపట్ల యువతి అఘాయిత్యం.. హత్య కేసుతో సంచలనం.. ముగ్గురు అరెస్ట్‌

అత్యాచారాలపర్వంలో మరో దారుణం ఇది. బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం చేసి కొట్టి చంపేశారు కామాంధులు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో జరిగిన ఈ ఘోరం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన సీఎం చంద్రబాబు… 48గంటల్లో నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు

అత్యాచారాలపర్వంలో మరో దారుణం ఇది. బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం చేసి కొట్టి చంపేశారు కామాంధులు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో జరిగిన ఈ ఘోరం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన సీఎం చంద్రబాబు… 48గంటల్లో నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీస్‌ బృందాలు.. 36గంటల్లోనే కేసును ఛేదించి ముగ్గురు ముద్దాయిలను కటకటాల వెనక్కి నెట్టారు

బాపట్ల జిల్లాలో జరిగిన దారుణ ఘటనను చేధించారు పోలీసులు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం యువతిపై జరిగిన లైంగిక దాడి, హత్య ఘటనను 36 గంటల్లో ఛేదించారు జిల్లా పోలీసులు. దారుణానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. నిందితులు ముగ్గురు మద్యం మత్తులో ఘటనకు పాల్పడ్డట్లు తేల్చారు పోలీసులు. ముగ్గురిపై గతంలో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Also read :AP: పరీక్ష రాయడానికి పుట్టింటికి వచ్చిన వివాహిత.. ఇంతలోనే దారుణం

నిందితులు ముగ్గురు ఈపూరుపాలెంకి చెందిన విజయ్, మహేష్, శ్రీకాంత్‌గా గుర్తించారు పోలీసులు. నిందితుల్లో ఇద్దరు గతంలో జరిగిన హత్య కేసులో ముద్దాయని తేల్చారు పోలీసులు. ఘటన జరిగిన టైంలో కొందరూ స్థానికులు వారిని ఘటనాస్థలంలో చూసినట్లు పోలీసులకు చెప్పడంతో అదే కోణంలో ఎంక్వైరీ చేశారు. 10 బృందాలుగా ఏర్పడి.. సెల్ టవర్స్, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. యువతి కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. కాగా, ఈ ఘటనను 48గంటల్లో ఛేదించాలని సీఎం చంద్రబాబు ఆదేశించండంతో.. ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు జరగకుండా గస్తీ పెంచుతామని చెప్పారు జల్లా ఎస్పీ. కేసును ఛేదించిన పోలీసులను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.

Also read :మండి బిర్యానీ తిని తిరిగొస్తూ..

Related posts

Share via