అతని పేరు రాము.. వయస్సు 70 ఏళ్లు.. తన కుమారుడు ఉమామహేశ్వరావుతో కలిసి మూడు రోజుల క్రితం మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చారు. తండ్రికొడుకులిద్దరూ దర్శనం చేసుకున్నారు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు సిద్దమయ్యారు. అదే సమయంలో ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చారు. అక్కడే ఉన్న రాము ఫోన్ చూసుకుంటూ వచ్చిందెవరా అంటూ చూశారు. అంతే.. క్షణాల్లో అతని చేతుల్లోని ఫోన్ లాక్కొని అక్కడ నుండి ఉడాయించారు. ఊహించని పరిణామంతో అవాక్కైన రాము ఫోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్నారు.
అయితే పనుల హాడావుడిలో స్టేషన్‌కు వెళ్లడం కుదరలేదు. రెండు రోజులు గడిచిన తర్వాత రాము బ్యాంక్ వెళ్లి అకౌంట్లో డబ్బులు తీయడానికి ప్రయత్నించగా లక్షల రూపాయలు డ్రా చేసినట్లు సిబ్బంది చెప్పారు. దీంతో రాము మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. వెంటనే తన ఫోన్ పోయిన విషయం గుర్తుకొచ్చింది. దుండగులు ఫోన్ కొట్టేసిన రోజు మూడు విడతలగా లక్ష రూపాయలను అకౌంట్ నుండి డ్రా చేసినట్లు తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
ఫోన్ దొంగలించి దాని ద్వారా లక్ష రూపాయలు డ్రా చేసుకున్నట్లు రాము ఫిర్యాదు చేశాడు. అయితే ఫోన్‌కు సింపుల్ పాస్ వర్డ్ పెట్టడంతోనే దొంగలు సులభంగా ఫోన్ పే నుండి డబ్బులు మళ్లించుకున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. సిసి కెమెరా విజువల్స్ ద్వారా ఫోన్ కొట్టేసిన వారిలో ఒకరిని గుర్తించారు. ప్రస్తుతం వీరి కోసం మంగళగిరి పోలీసులు గాలింపు చేపట్టారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి ఆప్‌లతో పాటు ఫోన్‌కు స్ట్రాంగ్ పాస్ వర్డ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వరుస నంబర్స్‌ను పాస్ వర్డ్‌గా పెట్టుకోవడంతోనే రాము ఖాతా నుండి డబ్బులు మళ్లించుకోవడం సులభతరమయిందని తెలిపారు. సైబర్ నేరగాళ్ళతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంతో పాటు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ ఏర్పాటు చేసుకోవాలంటున్నారు పోలీసులు
Also read
- Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
- ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
- ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
- సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం
- పూజ అయిపోయిన వెంటనే చేయకూడని 5 పనులు ఇవే..అలా చేస్తే దరిద్రం తప్పదు!