అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పిల్లలను అల్లరి చేస్తున్నాడని చిత్రహింసలకు గురిచేశాడో ఓ కసాయి తండ్రి. నాలుగేళ్ల కొడుకుకి నరకం చూపించిన తండ్రి కనీసం జాలి దయ లేకుండా చిత్రహింసలకు గురిచేసి చితక్కొట్టాడు. చచ్చేదాకా కొట్టి తన కసి తీర్చుకున్నాడు. అభం శుభం తెలియని ఆ పసికందు ఎవరికి చెప్పలేక ఏమి చేయలేక, నరకయాతన అనుభవించి ప్రాణాలను వదిలేశాడు. హృదయం తల్లడిల్లిపోయే ఈ అమానుష ఘటన కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో జరిగింది
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఆర్ట్స్ కాలేజీ రోడ్‌లో నివాసం ఉంటున్న షేక్ ఇమ్రాన్ అలీ తన నాలుగేళ్ల కొడుకు ముస్తకీంను చిత్రహింసలకు గురిచేసి చంపాడు. అభం శుభం తెలియని ఆ నాలుగేళ్ల బాలుడు నరకం చూసి చనిపోయాడు. పుట్టగానే తల్లిని కోల్పోయిన ముస్తకీం అప్పటి నుంచి బాధలు పడుతూనే ఉన్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తండ్రి తనకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. గత రెండు నెలల క్రితం కొడుకు చితకబాదడంతో చేయి విరిగింది. అయితే కనీసం ఆసుపత్రికి కూడా తీసుకు వెళ్లకుండా ఇంట్లో ఉంచాడు. నరకయాతన అనుభవిస్తున్న ఆ బాలుడిని చూసి కనీసం హృదయం కదలకుండా అలానే ఉంచాడు.
తాజాగా గత ఆదివారం(ఏఫ్రిల్ 7) రాత్రి ఆ తండ్రి మనసులో ఏముందో తెలియదు కానీ, ముస్తకీంపై విరుచుకుపడి ఆపస్మారకు స్థితిలోకి వెళ్లేలా చావబాదాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడు చివరికి ప్రాణాలను విడిచాడు. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పిల్లలను అల్లరి చేస్తున్నాడని చిత్రహింసలకు గురిచేసి నరకం చూపించిన తండ్రి కొట్టి చంపేశాడు. ఎవరికి తెలియకుండా ఖననం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన బాలుడి అమ్మమ్మ ప్రొద్దుటూరుకు చేరుకుని బాలుడు శవాన్ని చూసి షాక్ అయ్యారు.
బాలుడి ఒంటినిండా రక్తపు గాయాలతో చనిపోయి ఉన్నా తన మనవడిని చూసి కన్నీరు మున్నిలు అయింది. స్థానికుల సాయంతో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇమ్రాన్ అలీపై కేసు నమోదు చేశారు. గుర్తుచప్పుడు కాకుండా తన కొడుకు శవాన్ని ఖననం చేయాలనుకున్న తండ్రిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం