April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

ఆళ్లగడ్డలో మరోసారి తెరపైకి ఫ్యాక్షన్.. స్థానికులలో టెన్షన్.. అప్రమత్తమైన పోలీసులు..

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. భూమా అఖిలప్రియ సన్నిహితురాలు శ్రీదేవీ హత్యతో.. ఆమె కుటుంబ సభ్యులు ఏవీ సుబ్బారెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్తితి నెలకొంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సన్నిహితురాలు.. టీడీపీ నేత శ్రీదేవీ హత్యపై నిరసనలు కొనసాగుతున్నాయి. శ్రీదేవి కుటుంబ సభ్యులు ఏవీ సుబ్బారెడ్డి ఇంటి ఎదుట ఆందోళ చేపట్టి తమకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా శ్రీదేవి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు నిరహార దీక్ష చేపట్టారు. ఏవీ సుబ్బారెడ్డిని వెంటనే పార్టీ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం కొనసాగిస్తామంటున్నారు శ్రీదేవీ కుటుంబ సభ్యులు. తమకు కూడా భద్రతలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే వదిలేస్తే తమను కూడా చంపేస్తారని.. ఏవీ సుబ్బారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని పట్టుబట్టారు.

Also read :దగ్గరుండి భర్తకు మూడో పెళ్లిచేసిన ఇద్దరు భార్యలు.. ఎందుకో తెలుసా?

అయితే గతనెల 25న జరిగిన శ్రీదేవీ హత్యతో ఆళ్లగడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవిపై దాడి జరిగింది. కళ్లల్లో కారం చల్లి బండరాళ్లతో మోది శ్రీదేవి చంపేశారు. ఘటనలో.. తీవ్ర గాయాలైన భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్తి తగాదాలతోనే హత్య జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. హత్య అనంతరం మృతురాలు శ్రీదేవీ మరిది గోపాల్‌రెడ్డి, అతని భార్య పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. తన భార్య హత్య ఘటనలో ఏవీ సుబ్బారెడ్డి ప్రమేయం ఉందన్నారు శ్రీదేవి భర్త ఏవీ భాస్కర్ రెడ్డి. హత్యఘటనకు కారణమైన ఏవీ సుబ్బారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందని పార్టీ హైకమాండ్‌ను డిమాండ్ చేస్తున్నారు శ్రీదేవీ కుటుంబ సభ్యులు. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి ముందు హర్షవర్ధన్‌రెడ్డి, రమ్య ధర్నాతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫ్యాక్షన్ పరిస్థితులు తిరిగి తెరపైకి రావడంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయాందోళనలో స్థానికులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులపై ప్రతి ఒక్కరిలో ఆసక్తితో పాటూ.. ఉత్కంఠ నెలకొంది.

Also read :Vizag: ఆ బాయ్స్ హాస్టల్ నుంచి ఎప్పుడూ అదో రకమైన వాసన.. సమాచారంతో పోలీసులు తనిఖీ చేయగా

Andhra Pradesh: ఎందుకిలా చేశారమ్మా.. ఒకే కుటుంబం.. ఇద్దరు బాలికలు.. ఒకేసారి..

Related posts

Share via