పరీక్షల్లో ప్రశ్నకు సరైన సమాధానం తెలయకపోతే ఏదో ఒకటి రాసి రావడం విద్యార్ధులకు సర్వసాధారణమైపోయింది. అయితే 70 మార్కులుపైగా వచ్చిన ఓ విద్యార్ధి ఒక ప్రశ్నకు రాసిన జవాబును చూసి ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు. అరకొర మార్కులతో పాస్సయ్యే విద్యార్ధులు రాసే రాతలు చూసి టీచర్లు నవ్వుకోవడం పరిపాటి.. కాని 70కి పైగా మార్కులు వస్తున్నా.. ఇలాంటి రాతలు ఆ విద్యార్ధి ఎందుకు రాశాడో అర్ధంకాక ఉపాధ్యాయులంతా తలలు పట్టుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. అది బాపట్ల జిల్లాలోని స్థానిక మున్సిపల్ హైస్కూల్. పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. తెలుగు పేపర్లను టీచర్లు దిద్దుతున్నారు. అందులోని ఒక ప్రశ్న. రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి.? ఇందుకు ఆ విద్యార్ధి రాసిన జవాబు చూసి ఒక్కసారిగా ఆ టీచర్ ఆశ్చర్యపోయాడు. నాకు మార్కులు వేయకుంటే మా తాత చేత చేతబడి చేయిస్తా అని రాసి ఉండటాన్ని చూసిన ఉపాధ్యాయుడు.. దెబ్బకు మూల్యాంకనం చేయడం నిలిపి వేసి వెంటనే ఆ జవాబు పత్రాన్ని ఉన్నతాధికారులకు చూపించాడు. పేపరు మొత్తాన్ని పరిశీలించిన అధికారులు మరొక చోట రాసి ఉన్న జవాబు చూసి మరింత విస్తుపోయారు.
మరొక చోట ‘మంధర శివాజీ మహరాజ్‌ను తీసుకొని దండకారణ్యానికి వెళ్లింది’ అని రాసి ఉండటాన్ని గమనించారు. దీంతో అప్పటివరకు అసలు ఎన్ని మార్కులకు జవాబులు రాశాడు.? ఎన్ని మార్కుల వచ్చాయో పరిశీలించారు. అయితే ఆ విద్యార్దికి అప్పటికే 70 మార్కులు రావడం చూసి మరింతగా ఆశ్చర్యపోయారు. ఇన్ని మార్కులు వచ్చినా.. ఆ విద్యార్ధి మాత్రం ఇలాంటి జవాబులు ఎందుకని రాశాడో తెలియక టీచర్లు తికమకపడ్డారు. కాగా, విద్యార్ధి రాసిన జవాబులు చూసి మున్సిపల్ హైస్కూల్‌లోని కొందరు టీచర్లు నవ్వుకుంటే.. మరికొంతమంది విస్తుపోయారు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025