July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

అమ్మా.. పరీక్షలు రాయలేకపోతున్నంటూ వీడియో కాల్.. ఇంతలోనే విషాదం..!

విజయనగరం జిల్లాలో హృదయవిదార ఘటన వెలుగులోకి వచ్చింది. చదువుల ఒత్తిడితో ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. చివరిసారిగా తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అందరినీ కంట తడి పెట్టిస్తోంది.

“అమ్మా! నాకు బ్రతకాలని లేదు.. నేను చనిపోదాం అనుకుంటున్నాను. ఇంజనీరింగ్ పరీక్షలు ఫెయిల్ అయ్యా.. మళ్లీ ఇప్పుడు రాయాలన్నా రాయలేకపోతున్నా.. పరీక్షల రాయలేక ఇబ్బంది పడుతున్నా.. ఒత్తిడి భరించలేకపోతున్నాను. మిమ్మల్ని మోసం చేసి మీకు దూరం అవుతున్నా అమ్మా..! అమ్మా, నాన్న మిమ్మల్ని చివరిసారిగా ఒకసారి చూద్దామని వీడియో కాల్ చేశా. అమ్మా ఇదిగో నా చేతిలో ఉన్న ఈ నల్లటి వైర్లతోనే నేను ఉరేసుకొని చనిపోతున్నా. క్షమించండి అమ్మా.. ఇంక నేను బ్రతకలేను.. నా వల్ల కాదమ్మా ఉంటాను..” అంటూ కొడుకు వీడియో కాల్ ద్వారా చెప్పిన మాటలు చివరిసారిగా తల్లిదండ్రులను చూసి బోరున విలపించారు.

వారితో తమ ముద్దుల కొడుకు చెప్పిన ఆఖరి మాటలివి.. ఆ మాటలు విన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.. గుండెల నిండా ఉన్న ప్రేమతో.. ఎన్నో ఆశలు, ఆశయాలతో, అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కన్న కొడుకు కళ్ల ముందే చనిపోతునానమ్మా అని ధీనంగా చెప్తుంటే వీడియో కాల్ లో చూస్తున్న ఆ కన్న తల్లిదండ్రుల కన్నీటిని ఆపుకోలేని పరిస్థితి నెలకొంది.

వద్దు నాన్న, పరీక్షలు రాయలేకపోయినా పర్వాలేదు.. చదవకపోయినా పర్వాలేదు.. నువ్వు మాకు ఉంటే చాలు బాబు.. నువ్వు మా కళ్ళ ఎదురుగా కనిపిస్తే అదే మాకు కొండంత ఆస్థి.. అది నువ్వు మాకిచ్చే కానుక.. ప్రశాంతంగా ఆలోచించు.. వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేయ్ బాబు అని కొడుకుని ధీనంగా అర్థించారు ఆ తల్లిదండ్రులు. అయినా వారి మాటలు ప్రక్కనపెట్టిన ఆ కొడుకు ఫోన్ కట్ చేసి అక్కడే ఉన్న ఒక చెట్టుకి తనతో తెచ్చుకున్న నల్లటి వైర్లతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఆఖరి శ్వాస విడిచాడు ఆ యువకుడు.

విజయనగరం జిల్లా డెంకాడ మండలం అయినాడ సమీపంలో జరిగిన ఇంజనీరింగ్ విద్యార్థి మృతి అందరిని కలిచి వేస్తోంది. ఎన్‌టీఆర్ జిల్లా నందిగామకు చెందిన షేక్ లాల్ ముజఫర్ అనే విద్యార్థి విశాఖ జిల్లా దాకమర్రి సమీపంలోని ఒక ప్రవేట్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇంజనీరింగ్ ఈఈఈ బ్రాంచ్ ఫైనలియర్ చదువుతున్నాడు. ముజఫర్ తన బంధువు అయిన మరో విద్యార్థి రూమ్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. మరికొద్ది నెలల్లో ఇంజనీరింగ్ పూర్తవుతుంది. అయితే షేక్ లాల్ ముజఫర్ కి గత మూడేళ్ల లో కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. ఎన్ని సార్లు రాసిన సబ్జెక్ట్స్ పాసవ్వలేక పోతున్నాడు. దీంతో తోటి విద్యార్థుల దగ్గర కొంత అవమానంగా ఫీలవుతున్నాడు. అంతేకాకుండా ఇంజనీరింగ్ పూర్తయ్యే సమయానికి సబ్జెక్ట్స్ మిగిలిపోతే తల్లిదండ్రులు కూడా బాధపడతారని, వ్ర మనస్తాపానికి గురైన ముజఫర్ తాను ఉంటున్న రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు.

స్నేహితులు ఎంత వెదికినా ముజఫర్ జాడ కనిపించలేదు. ఈ క్రమంలోనే ముజఫర్ తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి అయినాడ సమీపంలోని ఓ ప్రవేట్ రియల్ ఎస్టేట్ వెంచర్ స్థలంలో నల్లని వైర్లతో ఉరేసుకొని మరణించాడు. అయితే వీడియో కాల్ చేసి తల్లిదండ్రులకు చనిపోతున్నట్లు చెప్పడంతో అప్రమత్తమై ముజఫర్ స్నేహితులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్నేహితులు పరిసర ప్రాంతాల్లో ఉన్న రియల్ ఎస్టేట్స్ లో వెదికారు. అర్ధరాత్రి వరకు వెదికినా ప్రయోజనం లేకపోయింది. తెల్లవారేసరికి తండ్రి కూడా విజయవాడ నుండి విజయనగరం జిల్లాకు చేరుకున్నాడు. తెల్లవారిన తరువాత మళ్లీ వెదకడం ప్రారంభించిన తరువాత చివరికి ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో ఉరేసుకొని విగతజీవిగా మారి కనిపించాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకును ఆ పరిస్థితిలో చూసిన తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via