February 23, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Srisailam: శ్రీశైలం శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి.. అధికారుల నిర్లక్ష్యానికి గాలిలోకి కార్మికుడి ప్రాణాలు..!



శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి దొర్లింది. విద్యుత్ కార్మికుడిని కాపాడేందుకు దేవస్థాన వైద్యశాల వైద్యులు అన్నిరకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో విద్యుత్ కార్మికుడు మృతి చెందాడు. దేవస్థానం అధికారులు విద్యుత్ శాఖ అధికారుల సమన్వయ లోపంతో కార్మికుడు మృతి చెందినట్లుగా స్థానికులు మండిపడుతున్నారు.


శ్రీశైలం శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి దొర్లింది. అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యుత్ కార్మికుడు బలయ్యాడు. విద్యుత్ షాక్‌తో కరెంటు స్తంభంపైనే వేలాడుతూ ప్రాణాలు వదిలాడు.


నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో ఏపీ ట్రాన్స్ కో టెండర్ ప్రాతిపదికన చేపడుతోంది. విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా రామాపురం గ్రామానికి చెందిన కార్మికుడు కృష్ణ(28) స్తంభంపై కరెంట్ పని చేస్తున్నాడు. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై, స్తంభంపైనే పడిపోయాడు. విషయం తెలుసుకున్న అధికారులు విద్యుత్ కార్మికుడిని కరెంట్ ఫోల్ మీద నుంచి కిందకు దించి దేవస్థానం వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే కార్మికుడు మరణించినట్లు వైద్య సిబ్బంది తెలిపింది.

విద్యుత్ కార్మికుడిని కాపాడేందుకు దేవస్థాన వైద్యశాల వైద్యులు అన్నిరకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో విద్యుత్ కార్మికుడు మృతి చెందాడు. దేవస్థానం అధికారులు విద్యుత్ శాఖ అధికారుల సమన్వయ లోపంతో కార్మికుడు మృతి చెందినట్లుగా స్థానికులు మండిపడుతున్నారు. కార్మికుడు విద్యుత్ పనులు చేసేటప్పుడు సప్లై ఉందా లేదా అని పరిశీలించి, సప్లై లేదని నిర్ధారించుకున్న తర్వాతనే పనులు చేయాలి. అయితే విద్యుత్ సప్లై లేనప్పుడు జనరేటర్ తో సప్లై అయినట్లు ప్రాథమిక సమాచారం. ఏది ఏమైనా నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ కార్మికుడు మృత్యు పాలయ్యాడు..!


ఇదిలావుంటే, శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ మేరకు తేదీలను కూడా ఖరారు చేశారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఫిబ్రవరి 23న స్వామి, అమ్మవార్లకు సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఏడాది బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని సీఎం ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా శివరాత్రి రోజు జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, మరునాడు జరిగే రథోత్సవం కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. క్యూలైన్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

Also read

Related posts

Share via