December 4, 2024
SGSTV NEWS
Andhra PradeshViral

Andhra Pradesh: వామ్మో.. పే..ద్ద నాగు పాము.. తిరుమలలో కలకలం..

సాధారణంగా పాముల పేరు వింటేనే భయంతో వణికిపోతుంటారు.. దూరంగా చూస్తేనే పరుగులు తీస్తారు.. అదే దగ్గరగా చూస్తే.. వామ్మో.. ఇంకేముంది పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. సాధ్యమైనంత వరకు విషపూరితమైన పాములకు (సరీసృపాలు) ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.. ఏటా వేలాది మంది పాముల కాటుతో చనిపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.. ముఖ్యంగా కింగ్ కోబ్రా లాంటి పాములు కాటేస్తే.. గంటల వ్యవధిలోనే చనిపోవడం ఖాయం.. అయితే.. అలాంటి భారీ నాగు పాము (కింగ్ కోబ్రా) తిరుమల క్షేత్రంలో కలకలం సృష్టించింది. మంగళవారం స్థానిక రింగ్‌రోడ్డు సమీపంలోని బి-టైప్‌ క్వార్టర్స్‌ 23వ గది వద్ద ఎనిమిది అడుగుల నాగు పామును స్థానికులు చూసి పరుగులు తీశారు.. వెంటనే.. అక్కడ సిబ్బంది అప్రమత్తమై.. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు..

వెంటనే అక్కడకు చేరుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం అటవీశాఖ ఉద్యోగి భాస్కర్‌నాయుడు.. కింగ్ కోబ్రా పామును అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు.. ఇలాంటి పాములు అరుదుగా కనిపిస్తాయని బాస్కర్ తెలిపారు.. రెస్క్యూ అనంతరం దానిని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు.

వీడియో చూడండి..



వాస్తవానికి శేషాచలం కొండల్లో నిత్యం అటవీ మృగాలు, సరీసృపాలు కనిపిస్తూనే ఉంటాయి.. కొన్ని సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనకు వచ్చిన భక్తులను కూడా హడలెత్తిస్తుంటాయి.. అయితే.. ఇలాంటి కింగ్ కోబ్రాలు అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయని.. సిబ్బంది చెబుతున్నారు. తిరుమల క్షేత్రంలో పాములు, జంతువులు కనిపిస్తే దాడి చేయకుండా వెంటనే సమచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

శేషాచలం అటవీ ప్రాంతం. తూర్పు కనుమల్లో ఒక అంతర్భాగం. అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, వృషబాధ్రి గా పిలిచే ఏడు కొండలు ఆదిశేషుని ఏడు పడగలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలోని తిరుమల కొండలు జీవరాసులు ఆవాసం. ఇందులో భాగంగానే ఈ పర్వత శ్రేణి 2010 లో జీవవైవిధ్య నెలవుగా కేంద్రం గుర్తించింది. అరుదైన వృక్షజాతులతో పాటు జంతు జాతులున్న శేషాచలంలో విష సర్పాలు కూడా ఎన్నో ఉన్నాయి. దట్టమైన ప్రాంతం నుంచి బయటకు వచ్చే విష సర్పాలు తిరుమలలో స్థానికులకు భక్తులకు తరచూ దర్శనం ఇస్తుంటాయి.

Also read

Related posts

Share via