April 19, 2025
SGSTV NEWS
Andhra Pradesh

Tirumala: వామ్మో.. తిరుమలలో 8 అడుగుల జెర్రిపోతు.. ఈయన చూడండి ఏం చేశాడో..

కామన్ గా పామును చూస్తే చాలు భయంతో పరుగులు తీస్తాం మనం. కలోలో కనిపించినా ఏదో ఆపద వస్తుందని ఆలయాలకు వెళ్లి నాగుల పుట్టకు పూజలు చేస్తాం. కానీ ఆయన మాత్రం పాము కనిపిస్తే చాలు నేన్నానంటూ ముందుకు వస్తాడు. పిల్ల పాముల నుండి కాలనాగుల వరకు దేనైనా చాక చక్యంగా పట్టుకుంటాడు. మానవ సేవే మాధవ సేవ రూపంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి కొలువులో స్నేక్ క్యాచర్ గా అవతారం ఎత్తి దాదాపు 10 వేలకు పైగా పాములను పట్టి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలి పెట్టాడు.

తిరుమలలో భారీ పాము ఒకటి భక్తుల కంటపడింది. వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో…‌ పాములు పట్టే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటన స్థలానికి చేరుకుని భారీ సైజు తో ఉన్న పామును పట్టుకున్నారు. స్థానికులు సంచరించే డీ‌ టైప్ క్వార్టర్స్ వద్ద ఈ పామును గుర్తించారు. తరువాత దూరంలో అటవీ ప్రాంతంలో జెర్రిపోతు పామును వదిలేశారు.

Also read :కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్కేసర్ కేసులో విస్తుపోయే విషయాలు

ఎన్నో ఏళ్లుగా తిరుమ‌ల‌, తిరుప‌తిలో విష స‌ర్పాల నుంచి భ‌క్తుల‌ను ర‌క్షిస్తున్నాడు స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు. టీటీడీ ఉద్యోగిగా ప‌నిచేస్తూ ఇప్పటి వ‌ర‌కు 10వేలకు పై చిలుకు పాముల‌ను రెస్క్యూ చేశాడు. రిటైరైనా ఇప్పటికీ టీటీడీలో ఆయన సేవలు అందిస్తున్నారు. అయితే 2022లో ఎస్వీ యూనివర్సిటీలో పామును పడుతుండగా దురదృష్టవశాత్తు గ్లౌజ్ ఊడిపోవడంతో భాస్కర్ నాయుడిని పాము కాటేసింది. చాలా డేంజర్‌లోకి వెళ్లి… తిరిగి కోలుకున్నాడు. తిరుమలలో ఎంత పెద్ద పాము అయినా.. ప్రమాదకర పాము అయినా సరే చిటికెలో పట్టెస్తాడు భాస్కర్ నాయుడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పామును అవలీలగా చేజిక్కించుకుంటాడు. తిరుమల, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భాస్కర్ నాయుడు పేరు తెలియని వారు ఉండరు. పాము కనిపిస్తే చాలు.. ఆయనకు కాల్ చేస్తారు స్థానికులు. ఫోన్ చేసి పాము కనిపించింది చెప్పడమే ఆలస్యం.. పది నిమిషాల్లో అక్కడ వాలిపోయి చాకచక్యంగా పామును తన చేతులతో బంధిస్తాడు భాస్కర్ నాయుడు.

Also read :Telangana: భర్త హత్యకు మూడు మేకల సుఫారి ఇచ్చిన భార్య.. ఎందుకో తెలుసా.?

Related posts

Share via